AP: త్వరలో పేర్ని నాని అరెస్ట్..!

AP: త్వరలో పేర్ని నాని అరెస్ట్..!
X
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర... తప్పు చేసిన వారు తప్పించుకోలేరని వ్యాఖ్య

వైసీపీ పాలనలో రెచ్చిపోయిన ఆ పార్టీ నేతలు ఊచలు లెక్కపెట్టడం ఖాయమనిపిస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోందని మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర వెల్లడించారు. మాజీ మంత్రి పేర్ని నాని త్వరలోనే అరెస్ట్ కాబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌పై స్పందించిన కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. పీడీఎస్ బియ్యం కేసులో నాని అరెస్ట్ ఉంటుందని మంత్రి తెలిపారు. టీడీపీ టికెట్‌పై గెలిచి చంద్రబాబునే తిట్టిన వ్యక్తి వల్లభనేని వంశీ అని మండిపడ్డారు. ఈ పరిస్థితి తెచ్చిన జగన్‌ను వంశీ తిట్టాలన్నారు. బందరులో బియ్యం దొంగ పేర్ని నాని ఉన్నాడని వ్యాఖ్యానించిన కొల్లు రవీంద్ర.. పీడీఎస్‌ రైస్‌ కేసులో త్వరలోనే అరెస్టు ఉంటుందన్నారు. గుడివాడలో గుట్కా కింగ్‌ ప్రస్తుతం అడ్రస్‌ లేడని ఎద్దేవా చేశారు. కర్మఫలం ఏ ఒక్కరినీ వదలదని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పేర్ని నాని అరెస్టు ఇప్పటికే ఆలస్యమైందని.. త్వరలో ఆయన కూడా అరెస్ట్ అవుతారని స్పష్టం చేశారు. మంత్రులే ఈ వ్యాఖ్యలు చేయడంతో నాని అరెస్టు ఖాయమనే వాదన వినిపిస్తోంది.

వంశీ కేసు విచారణ వేగవంతం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం హైదరాబాద్ విశాఖపట్నం ప్రత్యేక పోలీసు బృందాలను పంపారు. నిందితుల ఉపయోగించిన రెండు కాళ్ళను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు అందులో భాగంగా టోల్గేట్ దగ్గర కార్లను గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వంశీ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పెండింగ్ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా హనుమాన్ జంక్షన్లో ఎరువులు షాపును కూల్చి చేయించారనే దానిపై కేసు నమోదు అయింది. ఎలక్షన్ టైమ్లో తేలప్రోలులో ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై దాడికి పాల్పడిన ఘటనపై కేసు నమోదైంది. గన్నవరం TDP ఆఫీస్ దాడిలో A71గా ఉన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

Tags

Next Story