AP: జగనే దిక్కంటూ బోరుమన్న బోరుగడ్డ

అజ్ఞాతం వీడిన బోరుగడ్డ అనిల్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. తాను పారిపోలేదని వీడియోలో వెల్లడించారు. 'నన్ను పోలీసులు చిత్రహింసలు పెట్టారు. కూటమి ప్రభుత్వం నన్ను వేధిస్తోంది. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు, నా కుటుంబానికి ఏది జరిగినా కూటమి ప్రభుత్వానిదే బాధ్యత' అని అనిల్ అన్నాడు. తల్లి ఆనారోగ్యంతో భాధపడుతోందంటూ ఇటీవలే హైకోర్టులో బెయిల్‌పై బయటకు వచ్చిన బోరుగడ్డ.. మధ్యంతర బెయిల్ పొడిగింపు కోసం ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లు కోర్టులో చూపాడు. దీంతో ధర్మాసనం అతడికి బెయిల్ మంజూరు చేయగా బోరుగడ్డ అనిల్ ఏకంగా రాష్ట్రం నుంచే పరార్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి పట్టుకునేందుకు పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. బోరుగడ్డు స్వస్ధలం గుంటూరుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనిల్ ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు.
సంచలనంగా వీడియో
ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియా వేదికగా సంచలన వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో అతడు మాట్లాడుతూ.. తనకు బెయిల్ రాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించాడు. ఎలాగైనా తనను చంపాలని ప్లాన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఏం జరిగినా కూటమి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని తెలిపాడు. చెన్నై నగరంలో తన తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగిందని.. కన్నతల్లికి ఇప్పుడు తన అవసరం ఉందని బోరుగడ్డ ఆ వీడియాలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని... న్యాయస్థానాలను గౌరవిస్తానని... ప్రస్తుతం చెన్నైలో ఉండి తన తల్లిని చూసుకుంటున్నా అని.. తమకు ఎవరూ లేరని.. జగన్, వైసీపీయే దిక్కని అన్నారు.
బోరుగడ్డ కోసం పోలీసుల గాలింపు..
బోరుగడ్డ అనిల్‌కుమార్ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్‌తో హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందారని నిర్ధారించుకున్న పోలీసులు అతని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. గుంటూరు రాజేంద్రనగర్, వేళాంగిణినగర్‌లోని అతని ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు వేసి ఉన్నాయి. కుటుంబసభ్యులెవరూ స్థానికంగా అందుబాటులో లేరని, ఫోన్లను స్విచాఫ్ చేసినట్టు గుర్తించారు. అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు నమోదుచేసిన కేసులో రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ తన తల్లి ఆరోగ్యం బాగోలేదని ఫిబ్రవరి 15న మధ్యంతర బెయిల్ పొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com