బస్సు ప్రమాదంపై వైసీపీ తప్పుడు ప్రచారం.. ఇదేం తీరు

వైసీపీ పార్టీ ఛాన్స్ దొరికితే చాలు.. ఎలాంటి ఘటనను అయినా కూటమి పార్టీపై బురద జల్లేయడానికి వాడేస్తుంది. అసలు జరిగిన ఘటనకు, కూటమి ప్రభుత్వానికి సంబంధం ఉందా లేదా అన్నది కూడా వాళ్లు పట్టించుకోరు. ఏదో ఒక కట్టు కథ అల్లేసి కూటమిని బద్నాం చేయడమే వారి ప్రధాన లక్ష్యం. ఇప్పుడు వైసీపీ నేతలకు కల్తీ మద్యం కేసు కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియట్లేదు. పెద్ద నేతలు అందరూ ఇరుక్కునేలా ఉన్నారు. దీంతో అడ్డంగా దొరికిపోతే పరువు పోతుందనే ఉద్దేశంతో.. కూటమి ప్రభుత్వమే కల్తీ మద్యం అమ్ముతోందనే పచ్చి అబద్దాలకు తెర తీసింది వైసీపీ పార్టీ. దీనికి మొన్న కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదాన్ని కూడా వాడేసుకుంటోంది.
అసలే బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయి కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. మనిషన్న వారు ఎవరూ దీన్ని రాజకీయం చేయరు. కానీ వైసీపీ మాత్రం శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు దీన్ని కూడా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి వాడుకుంటోంది. ఈ ప్రమాదానికి ముందు బైకర్ శివ శంకర్, ఎర్రి స్వామిలు మద్యం తాగినట్టు ఇప్పటికే రిపోర్టులు వచ్చాయి. ఇంకేముంది వైసీపీకి ఇదో సందు దొరికినట్టు అయింది. వారిద్దరూ కూటమి ప్రభుత్వం బెల్టు షాపుల ద్వారా అమ్మిన మద్యం తాగి అలా మత్తులో కూరుకుపోయి ప్రమాదానికి కారణం అయ్యారంటూ తప్పుడు ప్రచారానికి తెర తీసింది. దీంతో అధికారులు కూడా అలెర్ట్ అయ్యారు.
అసలు వారిద్దరూ ఎక్కడ మద్యం కొన్నారో ఆధారాలతో పట్టుకున్నారు. పెద్ద టేకూరులోని రేణుకా ఎల్లమ్మ లైసెన్స్ డ్ వైన్స్ లోనే శివ శంకర్, ఎర్రిస్వామి మద్యం కొనుగోలు చేశారు. ప్రమాదం జరిగిన రోజుకు ముందు సాయంత్రం 7 గంటలకు, మరోసారి సాయంత్రం 8.25గంటలకు మద్యం కొన్నట్టు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అవుట్ లెట్ హైవే నుంచి 240 మీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే ఉందని చెప్పారు అధికారులు. ఆ ప్రాంతంలో ఎలాంటి అనధికార బెల్టు షాపులు లేవని తేల్చి చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు అధికారులు. దీంతో వైసీపీ ఫేక్ ప్రచారం మరోసారి బట్టబయలు అయింది. ఇంత త్వరగా తాము దొరికిపోతామని వైసీపీ బ్యాచ్ అనుకోలేదు. ఇది చూసిన ప్రజలు వైసీపీ తీరుపై ఛీ అంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

