కల్తీమద్యం కేసులో బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్..

కల్తీమద్యం కేసులో బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్..
X

కూటమి ప్రభుత్వ హయాంలో ప్రపంచ మేటి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. యూత్ కు ఉద్యోగాలు, స్కిల్స్ అంటూ కూటమి ఆలోచిస్తోంది. కానీ వైసీపీ హాయంలో మాత్రం కల్తీ మద్యం ఏరులై పారి.. చివరకు అదే యూత్ ప్రాణాలు తీసింది. ఇక్కడే కూటమికి, వైసీపీకి ఉన్న తేడా ఏంటో అర్థమైపోతోంది. ఏపీలో కల్తీమద్యం వందలాది మంది ప్రాణాలు తీసింది. ప్రజల ప్రాణాలపై దందా చేసి కోట్లు వెనకేసుకున్న వైసీపీ బ్యాచ్ లో ఇప్పుడు భయం మొదలైంది. జనార్థన్ రావు నేరుగా జోగి రమేశ్ పేరు చెప్పడంతో రచ్చ మొదలైంది. ఇక్కడే వైసీపీ ప్లాన్ బెడిసికొట్టినట్టు అయింది. ఎందుకంటే ముందు జోగి రమేశ్ మాట్లాడుతూ.. జనార్ధన్ రావు తనకు చిన్నప్పటి నుంచి తెలుసని.. కలిసి భాగస్వాములుగా పనిచేశామన్నారు.

దీంతో అడ్డంగా బుక్కైపోతామేమో అనే భయంతో లండన్ నుంచి మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. దెబ్బకు నాలుక కరుచుకున్న జోగి రమేశ్.. అసలు జనార్థన్ రావు ఎవరో తెలియదన్నట్టు.. అతని ముఖమే చూడలేదని.. నిజాయితీ షర్టు, ప్యాంటు వేసుకుంటే తనలాగే ఉంటుందన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చేశారు. లై డిటెక్టర్ టెస్టుకు కూడా రెడీ అనేసి సవాళ్లు విసురుతున్నారు. కానీ ఏం లాభం.. జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. జనార్థన్ రావు, జయచంద్రారెడ్డి వైసీపీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లే. కావాలనే టీడీపీలోకి వచ్చారు. కానీ వైసీపీ నేతల అండతోనే కల్తీమద్యం దందా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు.

జనార్థన్ రావును ఆఫ్రికా దేశంలో ఉంచేసి తాము సేఫ్ గా ఉండాలని ఇన్ని రోజులు వైసీపీ ప్లాన్ వేసింది. కానీ జనార్థన్ రావు సడెన్ గా ఆఫ్రికా దేశాల నుంచి రావడానికి కారణం వేరే ఉంది. ఎందుకంటే రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీల్ కంపెనీని కామెరూన్ దేశంలో బ్యాన్ చేశారు. అక్కడి ప్రజలు ఈ కంపెనీ తయారు చేస్తున్న కల్తీమద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్నారని యూత్ తిరగబడింది. దీంతో అక్కడ ఉంటే ఏం జరుగుతుందో అన్న భయంతో జనార్థన్ రావు ఇండియాకు వెళ్లిపోయి అప్రూవల్ గా మారిపోవాలనుకున్నారు. కానీ వైసీపీ బ్యాచ్ కు భయపడి.. ముందే ఓ వీడియో రిలీజ్ చేశారు. తన ప్రాణాలకు ఏం జరిగినా ఫలానా వాళ్లే కారణం అని చెప్పేశారు. నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయి.. జోగి రమేశ్ పేరు బయట పెట్టారు. పోలీసుల ముందు అన్నీ చెప్పేసి వాంగ్మూలం ఇచ్చారు. దీంతో వైసీపీ ప్లాన్ మొత్తం బెడిసికొట్టినట్టు అయిపోయింది. ఇప్పుడు ఎటూ తప్పించుకోలేని పరిస్థితి రావడంతో.. కూటమి ప్రభుత్వమే కల్తీమద్యం అమ్ముతోందంటూ ఫేక్ నిరసనలు మొదలు పెట్టారు. కానీ వాటికి ప్రజల నుంచి మద్దతు లేదు. ఇప్పుడు జోగి రమేశ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే పెద్ద నేతల పేర్లు బయటకు వస్తాయేమో అనే భయం వైసీపీలో కనిపిస్తోంది. మరి దీన్ని తప్పించుకోవడానికి కొత్తగా ఏం ప్లాన్లు వేస్తారో చూడాలి.


Tags

Next Story