AP: వైసీపీ నేతల చేతిలో టీచర్ హత్య.. కాసేపట్లో అంత్యక్రియలు

AP: వైసీపీ నేతల చేతిలో టీచర్ హత్య.. కాసేపట్లో అంత్యక్రియలు


విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామంలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. నిన్న వైసీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. గ్రామస్తులంతా భారీగా తరలిరావడంతో.. పోలీసులు భారీగా మోహరించారు. నిందితులు, వారి కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లడంతో వారికి సంబంధించిన గడ్డివాములను మృతుడి కుటుంబసభ్యులు తగలబెట్టారు. అయితే నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు వైసీపీ నేతలు కావడంతో పోలీసులు గోప్యత పాటిస్తున్నారనే వాదనలు ఉన్నాయి.

ఏగిరెడ్డి కృష్ణ నిన్న దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ను బొలెరో వాహనంతో ఢీకొట్టి హతమార్చి.. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. శనివారం ఉదయం తన ఇంటినుంచి కృష్ణ ద్విచక్రవాహనంపై బయల్దేరి తెర్లాం మండలం కాలంరాజుపేటలోని పాఠశాలకు వెళ్తున్నారు. ఒమ్మి సమీపంలోని కొత్తపేట వద్ద ప్రత్యర్థి వర్గం బొలెరో వాహనంతో ఆయన్ను ఢీకొట్టింది. దీంతో కృష్ణ కింద పడిపోయి చనిపోయారు. అక్కడి పరిస్థితులను చూసి ఇది హత్యేనని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు విచారణ చేపట్టగా, హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని నిర్ధారణ అయింది.

ప్రభుత్వ టీచర్ ఏగిరెడ్డి కృష్ణ హత్యను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక టీచర్ ను చంపడం దారుణమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ దాడులపై ప్రభుత్వ పెద్దల, అధికారుల ఉదాసీన వైఖరే ఇలాంటి ఘటనలకు కారణమన్నారు. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story