Andhra Pradesh: జలపాతంలో జారిపడి.. అమెరికాలో నివసిస్తున్న ఆంధ్రుడు మృతి

Andhra Pradesh: అమెరికాలోని ఇతాకా జలపాతం వద్ద జారిపడి కృష్ణా జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.ఉన్నత విద్యను అభ్యసించి కుటుంబాన్ని పోషించుకునేందుకు కుటుంబంతో సహా అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు జలపాతంలో జారిపడి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం.
కృష్ణా జిల్లా పోరంకిలోని వసంతనారాగ్ కాలనీకి చెందిన నెక్కలపు హరీశ్ చౌదరి(35) ఎంటెక్ పూర్తి చేసి కెనడాలో టూల్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితమే అతడికి సాయి సౌమ్యతో వివాహం అయింది. హరీష్ ప్రకృతి ప్రేమికుడు కావడంతో తన స్నేహితులతో కలిసి బుధవారం ఇతాకా జలపాతాన్ని చూసేందుకు న్యూయార్క్‌కు వెళ్లాడు.
అక్కడ ఫోటోలు దిగుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు జలపాతం వద్ద కాలు జారండంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. కొన్ని గంటల తర్వాత మృతదేహం నీటిలో తేలియాడుతూ ఉండడంతో స్థానిక పోలీసులు వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు.
ఆయన మరణవార్త విని కృష్ణా జిల్లాలో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. తానా సహకారంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com