Chittoor: జల్లికట్టులో గాయాలపాలైన యువకుడు.. పరిస్థితి విషమం..

X
Chittoor: చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్ట జల్లికట్టులో పలువురు గాయపడ్డారు. గిత్తల కొమ్ములకు కట్టిన బహుమతుల్ని సొంతం చేసుకునేందుకు అంతా పోటీ పడిన క్రమంలో అవి కుమ్మేయడంతో కొందరికి గాయాలయ్యాయి. ఓ యువకుడి తలకు దెబ్బ తగలడంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ జల్లికట్టు కోసం ఎడ్లను కూడా తమిళనాడు నుంచే తీసుకువచ్చారు.
స్థానిక నేతల సహకారంతో ఈ జల్లికట్టు ఆడిస్తూ.. వేలల్లో బహుమతులు పెట్టి వీటిని నిర్వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఏటా సంక్రాంతికి ముందు నుంచి చిత్తూరు పల్లెల్లో సంప్రదాయంగా జల్లికట్టు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు పండగ ముగిసినా కూడా పోటీలు పెట్టడం.. పోలీసులు ఏమీ పట్టనట్టు చూడడం చర్చనీయాంశమైంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
