Nellore : కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

Nellore : కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
X

కుటుంబ కలహాలతో నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ఓ యువకుడు ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 11.30 గంటలకు మృతి చెందాడు. ఈ ఘటన సెల్ఫీ వీడియోతో వెలుగు చూసింది. వివరాల మేరకు.. మండలం లోని కొట్టాలు గ్రామానికి చెందిన కుంకు తేజేష్ (26) తిమ్మాయిపాళెం పంచాయతీ కుంకు తేజేష్(ఫైల్) ఉలవపల్లి కొట్టాలు మధ్యలో తన భార్య, అత్త వేధిస్తున్నారని, తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లడం కూడా ఇష్టం లేక తనను మానసికంగా వేధించారని, వివాహం చేసుకున్నప్పటి నుంచి తనను నానా రకాలుగా హింసిస్తున్నారని, ఒపిక నశించి అత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్పీ వీడియో తీసుకున్నాడు. అదే విధంగా అమ్మ, నాన్నలను బాగా చూసుకోవాలని తన అన్నకి చెబుతూ, తన చావుకు కారణం తన భార్య సరళ, తన అత్తే కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంతరం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంత సేపటి తర్వాత అటుగా వెళ్లిన పశువుల కాపరులు గమనించి స్థానికుల సహాయంతో 108 వాహనం ద్వారా ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి నెల్లూరు నారాయణ వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించారు. అయితే పరిస్థితి మెరుగుపడకపోవడంతో నెల్లూరులోని ఏసీఎస్ఆర్ జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Tags

Next Story