ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసు విచారణ వాయిదా

X
ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో సోమవారం నుంచి రోజువారీ విచారణ మొదలు కావాల్సి ఉన్నా న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా.. ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి కేసు రేపటికి వాయిదా వేశారు. ఆస్తుల విషయంలో సీబీఐ, ఈడీ కేసులు కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు కేసులపై స్టే ఉంది. వీటి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై మంగళవారం విచారణలో స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులపై కేసులు త్వరితగతిన పూర్తి చేయాలన్న సుప్రీం నిర్ణయం నేపథ్యంలోనే అన్ని కోర్టుల్లోనూ విచారణకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
