JAGAN: సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్దమవుతోన్నారు. ఈ నేపథ్యంలో తన విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ.. శుక్రవారం ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 11 నుంచి 25 వరకు కుటుంబ సమేతంగా యూకే పర్యటనకు అనుమతి ఇవ్వాల్సిందిగా పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా జగన్ పిటిషన్‌పై కౌంటర్ ధాఖలు చేయాలని న్యాయస్థానం సీబీఐ అధికారులను ఆదేశించింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన తరువాత దీనిపై వాదనలు జరగనున్నాయి. కుటుంబ సమేతంగా తాను లండన్ వెళ్లాలనుకొంటున్నట్లు వైఎస్ జగన్.. తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వైఎస్ జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐని కోర్టు ఆదేశించింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన అనంతరం కోర్టులో వాదనలు ప్రారంభంకానున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా...
గతేడాది ఎన్నికల్లో ఆంధ్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ పూర్తయింది. అనంతరం వైఎస్ జగన్ తన కుటుంబంతో కలిసి లండన్ పయనమైయ్యారు. ఎన్నికల ఫలితాల ముందు ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. దీంతో తమకు ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. తమకు ప్రతిపక్ష హోదా కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు అక్రమాస్తుల కేసులో గతంలో వైఎస్ జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో 16 నెలలు ఆయన చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్‌పై ఆయన బయటకు వచ్చారు. ఇక ఆయన ఇద్దరు కుమార్తెలు ఒకరు లండన్‌లో మరొకరు యూఎస్‌లో ఉన్నారు. దాంతో వారి వద్దకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు నుంచి వైఎస్ జగన్ అనుమతి పొందాల్సి ఉంది
ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి
వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరుకానున్నారు. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని వాటాలను విజయసాయిరెడ్డి బలవంతంగా లాగేసుకున్నారంటూ గతంలో ఈడీకి కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈడీ.. విజయసాయిరెడ్డి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించింది. సోమవారం తమ ఎదుట హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com