YS Jagan: ఢిల్లీ పర్యటనలో రెండో రోజు.. అమిత్‌షాతో భేటీ అయిన వైఎస్ జగన్..

YS Jagan: ఢిల్లీ పర్యటనలో రెండో రోజు.. అమిత్‌షాతో భేటీ అయిన వైఎస్ జగన్..
YS Jagan: రెండవ రోజు హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.. దాదాపు 45 నిమిషాల పాటు అమిత్‌షాతో మాట్లాడారు.

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ పర్యటన ముగిసింది.. రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన జగన్‌.. రెండవ రోజు హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.. దాదాపు 45 నిమిషాల పాటు అమిత్‌షాతో మాట్లాడారు. ఈ భేటీలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయి.. ఇటీవల జరిగిన సౌత్‌ జోనల్‌ కమిటీ మీటింగ్‌లో లేవనెత్తిన సమస్యల పరిష్కారంపై ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లయినా విభజన సమస్యలు ఇంత వరకు పరిష్కారం కాలేదని, ఆస్తుల పంపకాలు త్వరగా పూర్తిచేయాలని అమిత్‌షాను కోరారు జగన్‌.

అయితే, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ వంటి అంశాలపై చర్చించినట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, మెడికల్‌ కాలేజీలు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపుపై షాతో చర్చించారని అంటున్నారు. జగన్‌ ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాల విషయంపై కాకుండా కేవలం రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే ఢిల్లీ పర్యటన సాగినట్లుగా తెలుస్తోంది. గురువారం ప్రధాని మోదీతో మాట్లాడిన పాత అంశాలనే.. అమిత్‌షాతోనూ చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రాజకీయ అంశాలపైనే అమిత్‌షాతో చర్చ జరిగిందని భావిస్తున్నారు.

అంతకు ముందు నిర్మలా సీతారామన్‌తో ఏం చర్చించారన్నది అధికారిక వర్గాలు సైతం వెల్లడించలేదు. ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పర్యటన జరిగి ఉంటే.. ఆ వివరాలను కనీసం మీడియాకు కూడా ఎందుకు చెప్పడం లేదనే ప్రశ్న వినిపిస్తోంది. అటు జగన్‌ ఢిల్లీ పర్యటనపై విపక్షాలు మండిపడుతున్నాయి.. కీలకమైన ప్రత్యేక హోదా గురించి కేంద్రం పెద్దల దగ్గర ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నాయి.. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యాన్నైనా అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలు రాబట్టాల్సిన ముఖ్యమంత్రి.. అప్పులు, తనపై ఉన్న కేసులు, వివేకా మర్డర్‌ దర్యాప్తు గురించి మాట్లాడారని ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ ప్లాంట్ అమ్మకంపై కేంద్రాన్ని గట్టిగా అడిగే సందర్భం వచ్చినా సరే.. జగన్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story