YS Jagan: ఢిల్లీలో జగన్.. మోదీ, నిర్మలా సీతారామన్‌లతో భేటీ..

YS Jagan: సీఎం జగన్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో.. పలు అంశాలపై చర్చలు జరిపారు. వీరిద్దరి భేటీ కేవలం పది నిమిషాలే జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులు, పన్నుల రాబడి, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న సహకారం, వంటివి కేంద్రమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు.. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు సీఎం జగన్. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా.. జూలైలో జరిగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు, రాష్ట్ర రుణపరిమితిపై విధించిన సీలింగ్‌పై గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
2021-22 ఆర్ధిక సంవత్సంలో.. 42 వేల 472 కోట్ల రుణ పరిమితి ఉండగా.. ఇప్పటికే 55 వేల కోట్లు రుణంగా తీసుకుంది జగన్ సర్కారు. దీనిపై కాగ్‌తో పాటు కేంద్ర ఆర్థిక శాఖ.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీటిపై ప్రధాని మోదీకి సీఎం జగన్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే.. రుణ పరిమితిపై సీలింగ్ పెంచాలని కోరినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com