YS Jagan : జమిలి ఎన్నికలపై జగన్ ట్విస్ట్

నేషనల్ పాలిక్స్ పై మరోసారి వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ కూటమి వైపు వెళుతున్నట్లు సంకేతం ఇచ్చిన జగన్.. జమిలి ఎన్నికల బిల్లు విషయంలో రూటు మార్చారు. లోక్ సభలో జమిలి బిల్లుకు వైసీపీ ఎంపీలు మద్దతు ఇచ్చారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కాక జమిలి బిల్లుకు బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీ ఒక్క వైసీపీనే. గతంలో జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తే ఇండి కూటమిలోని కొన్ని పార్టీలే మద్దతు ఇచ్చాయి. ఇండి కూటమి పగ్గాలు మమతా బెనర్జీకి ఇవ్వాలని వైసీపీ నేతలు చెప్పడంతో .. ఆ కూటమిలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతు ఇచ్చి మోడీ ప్రభుత్వానికి బాసటగా నిలిచారు జగన్. ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదని గ్రహించే.. జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. బిల్లుల వారీగా వైసీపీ మద్దతు ఎలా ఉంటుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com