YS Jagan : పవన్ కళ్యాణ్ మీద జగన్ కుట్రలు

మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కూటమి పార్టీల మధ్య చీలిక తేవడమే తన ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఎంతకైనా తెగించేందుకు కుట్రలు చేస్తున్నారు. మొన్న అంబటి రాంబాబుతో సీఎం చంద్రబాబు నాయుడుని బూతులు తిట్టించడం వెనక కూడా జగన్ కుట్రలు ఉన్నాయని తేటతెల్లమయింది. అంబటి రాంబాబు మీద వైసిపి కార్యకర్తలు చేసి దాన్ని కూటమి ప్రభుత్వం మీదకు నెట్టేశారు. అప్పుడు కాపు కులం మీద టిడిపి దాడి అంటూ వైసీప తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకుంది. కాపు కులాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టేశాడు అంటూ లేనిపోని కులాలు చిచ్చు పెడుతున్నారు మాజీ సీఎం జగన్.
అందులో భాగంగానే వైసిపి సోషల్ మీడియా, సాక్షి మీడియాలో ఇష్టం వచ్చినట్టు కథనాలు రాయిస్తున్నారు. జోగి రమేష్ ఇంటి మీద వైసిపి బ్యాచ్ దాడులు చేసిన దాడిని కూటమి మీదకు నెట్టేసే ప్రయత్నం చేశారు. దీని వెనకాల కూడా జగన్ కుట్రలు ఉన్నాయనేది అర్థమయిపోయింది. ఇలా కులాల మధ్య చిచ్చుపెట్టి పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా దెబ్బతీయటమే వైసిపి టార్గెట్ గా పెట్టుకుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా కులాల ప్రస్తావన తీసుకురారు అనే విషయం వైసిపి గుర్తుంచుకోవాలి. ఆయన ఎంతసేపు ఏపీలో అభివృద్ధి గురించి మాట్లాడుతారు తప్ప తనను ఒక కులానికి ఆపాదించవద్దు అని పదేపదే చెబుతుంటారు.
కానీ ఇక్కడ జగన్ ఉద్దేశం ఏంటి అంటే కూటమి కలిసి ఉన్నంతకాలం ఆయన అధికారంలోకి రాడు కాబట్టి కులాల మధ్య కుంపటి పెట్టి పార్టీలను విడదీయడానికి ఇలాంటి నీచమైన కుట్రలకు తెలతీస్తున్నారు. వైసీపీ ఇలాంటివి ఎన్ని చేసినా సరే మళ్లీ అధికారంలోకి వచ్చేది ఇంకో పాతికేళ్ల తర్వాతనే అంటున్నారు ఏపీ ప్రజలు.
Tags
- YS Jagan Mohan Reddy
- YSRCP conspiracy
- alliance politics Andhra Pradesh
- Chandrababu Naidu abuse controversy
- Ambati Rambabu issue
- Kapu community politics
- Pawan Kalyan stand on caste
- YSRCP false propaganda
- Sakshi media allegations
- Jogi Ramesh house attack
- YSRCP social media campaign
- caste politics in AP
- coalition government Andhra Pradesh
- YSRCP political strategy
- Andhra Pradesh latest political news
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
