YS Jagan : ఎందుకింత బిల్డప్ జగన్..!

మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు వీలు కుదిరినప్పుడల్లా బెంగుళూరు ప్యాలెస్ నుంచి ఏపీకి వచ్చి నానా హడావిడి చేసేస్తున్నారు. వచ్చిన ప్రతిసారి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మనుషులను తన కారు చుట్టూ ఉండేలా రప్పించుకుంటున్నారు. దాన్ని వైసిపి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. కూటమి మీద తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని.. అందుకే జగన్ కాన్వాయ్ చుట్టూ వేల మంది వచ్చి ఉంటున్నారు అని ఓ తప్పుడు ప్రచారం చేసుకోవడానికి ఇలా కోట్లు ఖర్చుపెట్టి ఫేక్ అభిమానులను సృష్టించుకుంటున్నారు జగన్. ఈ బిల్డప్ రాజకీయాలు ఎక్కడిదాకా వెళ్లాయి అంటే.. చివరకు పరామర్శకు వెళ్ళినా సరే షో చేయడానికే జగన్ ఆరాటపడుతున్నారు.
కారు చుట్టూ వందల మంది షేక్ అభిమానులు నిలిచి ఉన్నంత మాత్రాన జగన్ 2029 లో అధికారంలోకి వస్తారు అనుకుంటే కలే అవుతుంది. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఎంతసేపు ఒక హైపు క్రియేట్ చేయడం కోసమే జగన్ ప్రయత్నిస్తున్నారు. నిన్న మాజీ మంత్రి అంటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి ఎంత హడావిడి చేశారో చూశాం. వేలాదిమందినీ డబ్బులు ఇచ్చి జగన్ కారు వెంబడి వచ్చేలా ప్లాన్ చేశారు. దాన్ని వైసిపి సోషల్ మీడియాలో, సాక్షి మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ.. జగన్ కి ప్రజల్లో వీరాభిమానం పెరిగిపోయింది అన్న రేంజ్ లో రాసుకొస్తున్నారు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలా షో చేయడం ఎందుకు. ఇలాంటి బిల్డప్ లకు పోయి గతంలో ఒక నిండు ప్రాణాన్ని జగన్ కారు కింద తొక్కించిన ఘటన అందరికీ గుర్తే ఉంది. మరోసారి అలాంటి ప్రమాదం జరగదని జగన్ గ్యారంటీ ఇవ్వగలరా..
ఒకవేళ ఎవరికైనా ఏమైనా జరిగితే కూటమి ప్రభుత్వం సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు కాబట్టి ఇలా జరిగింది అంటూ బురద జల్లడానికి వైసీపీ రెడీగా ఉంటుంది. కానీ జగన్ ఇలాంటి ఫేక్ ర్యాలీలు ఎన్ని చేసినా సరే మరోసారి అధికారంలోకి రావడం జరగని పని అని కూటమి నేతలు అంటున్నారు. ప్లాన్ ప్రకారమే అంబటి రాంబాబు ఇంటి మీద వైసీపీ బ్యాచ్ తో దాడి చేయించిన జగన్.. ఇప్పుడు సింపతి రాజకీయాల కోసం పరామర్శలు అంటూ బయలుదేరారు. పరామర్శకు వెళ్తే కామ్ గా వెళ్లి రావాలి.. అంతేగాని బిల్డప్ ల కోసం కాదు అనేది జగన్ గుర్తుంచుకోవాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
