YS Jagan : బెడిసికొట్టిన జగన్ ప్లాన్.. సుప్రీంకోర్టు దాకా వెళ్లి..!

మాజీ సీఎం జగన్ జగన్ ఎన్ని ప్లాన్లు వేసినా పాపం అట్టర్ ప్లాప్ అవుతూనే ఉన్నాయి. తిరుమలలో లడ్డూ కల్తీ నెయ్యిలో అసలు దోషుల పేర్లను బయటపెట్టడమే ఉద్దేశంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏక సభ్య విచారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ నియమించిన సిట్ నివేదికలో నిందితుల పేర్లు లేవు కాబట్టి జబ్బలు చరుచుకున్న వైసీపీ.. ఇప్పుడు తాము ఎక్కడ దొరికిపోతామేమో అని ఏకంగా సుబ్రహ్మణ్య స్వామితో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించింది. తమ వైసీపీ లీడర్లు వేస్తే ప్రజల నుంచి మద్దతు రాదనే ఉద్దేశంతో స్వామితో వేయించారు వైసీపీ అధినేత జగన్. కానీ సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. ఏకసభ్య విచారణ కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.
దీంతో వైసీపీ నేతల్లో మళ్లీ టెన్షన మొదలైంది. తాము ఎన్ని కుట్రలు చేసినా కల్తీ నెయ్యి కేసులో అసలు నిందితులు తప్పించుకోలేరు అనే విషయం వారికి బాగా అర్థం అయింది. అందుకే మైకుల ముందుకు వస్తున్న వైసీపీ నేతలంతా ఎక్కడలేని నీతి మాటలు చెబుతున్నారు. రూల్స్ గురించి మాట్లాడుతున్నారు. అసలు తప్పే చేయనప్పుడు ఎన్ని విచారణ కమిటీలు వేస్తే వారికేంటి. తప్పు చేసిన వారికే భయం ఉంటుంది కదా. మరి ఆ లెక్కన వైసీపీ నేతలు కూడా తప్పు చేసినట్టే అంటారా.
పోనీ ఏకసభ్య విచారణ కమిటీ ఏమైనా నిర్దోషులను దోషులుగా చిత్రీకరిస్తుందా. ఉన్నది ఉన్నట్టే విచారణ జరుపుతారు కదా. పైగా మాజీ ఐపీఎస్ అధికారి దినేష్ కుమార్ ఒక్కరే ఇందులో ఉంటారు. అలాంటప్పుడు సాక్ష్యాలను బట్టే కదా ఆయన విచారణ ఉంటుంది. మరి వైసీపీ భయం అంతా సాక్ష్యాల్లో అడ్డంగా దొరికిపోతాం అనా.. ఏదేమైనా వైసీపీలో ఏకసభ్య విచారణ కమిటీ భయం స్పష్టంగా కనిపిస్తోంది. తప్పు చేసిన వారికే భయం ఉంటుందనే విషయాన్ని మరోసారి వైసీపీ నేతలను చూస్తుంటే అర్థం అవుతోందని కూటమి నేతలు అంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
