YS SHARMILA: "జగన్ గారు ఉద్దరించింది శూన్యం"

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘"అన్నమయ్య..ఇక అంతేనయ్య". ప్రాజెక్ట్ కొట్టుకు పోయి ఐదేళ్లు దాటినా పునర్: నిర్మాణానికి దిక్కులేదు. 39 మందిని బలిగొన్న ఘోర విపత్తులో జరిగిన నష్టాన్ని పూడ్చే మనసు ప్రభుత్వాలకు లేదు. 5 ఊళ్లు కొట్టుకుపోతే పునరావాసానికి రూపాయి ఇచ్చింది లేదు. సర్వం కోల్పోయిన నిరాశ్రయులను నేటికీ ఆదుకున్నది లేదు. గత వైసీపీ, నేడు కూటమి ప్రభుత్వాలు కలిసి అన్నమయ్య ప్రాజెక్ట్‌ను "అనాథ ప్రాజెక్ట్" కింద మార్చారు. గత ముఖ్యమంత్రి జగన్ రూ.800 కోట్లతో మరమత్తులు అంటూ హడావిడి తప్పా ప్రాజెక్ట్‌ను కట్టింది లేదు. పునరుద్ధరణ పేరుతో మూడేళ్లు గడిపారే తప్పా.. తట్టెడు మట్టి వేయలేదు. బాధిత కుటుంబాలకు ఇండ్లు అందలేదు. చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు దక్కలేదు. ఇసుక మాఫియాతో ప్రాజెక్టుకు గండి పడితే అసెంబ్లీ వేదికగా హై లెవెల్ కమిటీలనీ, దర్యాప్తు కొనసాగిస్తామని కాలయాపన తప్పా జగన్ గారు ఉద్ధరించింది శూన్యం." అని షర్మిల తీవ్రంగా విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై ఇప్పటికే సీఆర్డీఏ 50 ఎకరాలు కేటాయించింది. ప్రభుత్వ సంస్థగా ఏక్యూసీసీ ఏర్పాటు కానుంది. వివిధ రంగాల్లో పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటం వ్యాలీ సేవలందిస్తుంది. 2 వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్, 5కె గేట్స్ క్యాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ ముందుకు వచ్చింది. అధునాతన కూలింగ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరాను ప్రభుత్వం క్వాంటం వ్యాలీకి అందించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com