YS VIJAYAMMA: వైసీపీకి విజయమ్మ రాజీనామా.. కారణం అదేనా..!

YS VIJAYAMMA: వైసీపీకి విజయమ్మ రాజీనామా.. కారణం అదేనా..!
YS VIJAYAMMA: వైసీపీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాజీనామా చేశారు. షర్మిలకు రాజకీయంగా అండగా ఉంటానని ప్రకటించారు.

వైసీపీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాజీనామా చేశారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉండకూడదని నిర్ణయించుకున్నానని విజయమ్మ స్పష్టం చేశారు. ఈ పార్టీ నుంచి తప్పుకున్నానంటూ వైసీపీ ప్లీనరీ వేదికగా ప్రకటించారు. కొందరి విమర్శలకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ చెప్పారు. షర్మిలకు రాజకీయంగా అండగా ఉండాలనే రాజీనామా చేస్తున్నాన్నారు.


విజయమ్మ వైసీపీకి దూరం అవుతారంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. వాటిని వైసీపీ ముఖ్యనేతలంతా ఖండించారు. మీడియా అసత్యప్రచారం చేస్తోందంటూ ఎదురుదాడికి దిగారు. చివరికి ప్లీనరీ వేదికగానే గౌరవ అధ్యక్షురాలి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగన్‌తో విభేదాల కారణంగా గతంలోనే వైసీపీకి షర్మిల దూరమైతే.. ఇప్పుడు తల్లి విజయమ్మ కూడా గుడ్‌బై చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story