వైఎస్ వివేకా హత్య కేసు..పులివెందుల వాగులో ఆయుధాల కోసం గాలింపు

X
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో CBI విచారణ మరింత ఉత్కంఠ రేపుతోంది. కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్ చెప్పిన చోట, నిన్నటి నుంచి మారణాయుధాలకోసం గాలింపు కొనసాగుతోంది. ఆ కత్తులు కనుక బయటపడితే నెమ్మదిగా మిగతా చిక్కుముళ్లు కూడా వీడిపోతాయి. ఈ నేపథ్యంలోనే పులివెందుల రోటరీపురం వాగులో 2వ రోజు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు. మున్సిపల్ కార్మికులు అదనపు మోటర్లు తప్పించి మరీ కాల్వలోని మురుగునీరు తోడేయించారు.
అయితే అక్కడ బురద ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. మెటల్ డిటెక్టర్ తెప్పించేందుకు ఇప్పుు సీబీఐ అధికారుల ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ, రేపట్లో కచ్చితంగా వివేకాను చంపేందుకు వాడిన ఆయుధం బయటపడుతుందనే మాట వినిపిస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
