YS Vivekananda Reddy Death: వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి కన్ఫెషన్.. హత్య గురించి ఏం చెప్పారంటే..

YS Vivekananda Reddy Death: వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి కన్ఫెషన్.. హత్య గురించి ఏం చెప్పారంటే..
YS Vivekananda Reddy Death: మాజీ మంత్రి Y.S.వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి.

YS Vivekananda Reddy Death: మాజీ మంత్రి Y.S.వివేకానంద రెడ్డీ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. విచారణ దాదాపు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమా శంకర్‌తో కలిసి వివేకానందరెడ్డిని హత్య చేసినట్లు దస్తగిరి తన కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో చెప్పారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్రణాళిక రూపొందించినట్లు దస్తగిరి చెప్పారు.

బెంగళూరు ల్యాండ్ వివాదంలో తన వాటా ఇవ్వకపోవడంతో వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేశారని దస్తగిరి స్పష్టం చేశారు. MLC ఎన్నికల్లో తనను కావాలనే ఓడించారని వివేకానందరెడ్డి.. అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు వార్నింగ్ ఇచ్చాడని విచారణలో దస్తగిరి చెప్పాడు. ఒక్కడివే కాదు తాము వస్తాం వివేకాను చంపేద్దామంటూ గంగిరెడ్డి చెప్పాడని దస్తగిరి తన కన్ఫెషన్ స్టేట్‌మెంట్ లో స్పష్టం చేశాడు.

దీని వెనుక అవినాష్ రెడ్డి, Y.S.మనోహర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దొండ్లవాగు శంకర్‌రెడ్డి ఉన్నారని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడని దస్తగిరి వెల్లడించాడు. వివేకా హత్యకు 40 కోట్ల రూపాయలు సుపారీ జరిగినట్లు దస్తగిరి ఒప్పుకున్నాడు. తనకు 5 కోట్లు ఇస్తానని చెప్పి.. ఇచ్చిన అడ్వాన్స్ లో 25 లక్షలు సునీల్ యాదవ్ తీసుకున్నాడని, మిగతా 75 లక్షల రూపాయలు స్నేహితుడు మున్నా దగ్గర దాచుకున్నట్లు దస్తగిరి వివరించారు.

వివేకా ఇంటి దగ్గర కుక్కను సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తొక్కి చంపారని దస్తగిరి విచారణలో చెప్పారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో కలిసి వివేకా ఇంటి కాంపౌండ్‌ లోకి దూకివెళ్లామన్నారు దస్తగిరి. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి.. తలుపు తీయడంతో లోపలికి వెళ్లామని.. దస్తగిరి కన్పెషన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. తనను చూసిన వివేకానందరెడ్డి ఈ టైంలో వీళ్లేందుకు వచ్చారంటూ అడిగారని.. తర్వాత వివేకా బెడ్‌రూంలోకి వెళ్లారని దస్తగిరి తన కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో చెప్పాడు.

వివేకా వెనుకే గంగిరెడ్డి బెడ్‌రూంలోకి వెళ్లారని..అక్కడ డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగిందని దస్తగిరి చెప్పాడు. వివేకాను బూతులు తిడుతూ మొహంపై సునీల్ యాదవ్ దాడి చేశాడని.. తర్వాత గొడ్డలితో దాడి చేశాడని చెప్పారు. వెంటనే వివేకా కింద పడిపోయాడని.. అతని ఛాతిపై సునీల్ యాదవ్ 7 నుంచి 8 సార్లు బలంగా కొట్టాడని దస్తగిరి చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story