YSRCP : శాసనమండలి సాక్షిగా వైసిపి అబద్ధాలు.. డైవర్ట్ రాజకీయమా..

YSRCP : శాసనమండలి సాక్షిగా వైసిపి అబద్ధాలు.. డైవర్ట్ రాజకీయమా..
X

వైసిపి పార్టీ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని రకాల తప్పుడు అబద్ధాలు అయినా చెప్పడానికి రెడీగా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. ప్రజలు నవ్వుతారు అనే విషయం కూడా మర్చిపోయి పచ్చిగా అబద్ధాలు ఆడేస్తున్నారు వైసిపి నేతలు. ఇప్పుడు తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసిపి నేతలు ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అనేది మనందరం చూస్తూనే ఉన్నాం. కానీ అవేవీ ప్రజలు పెద్దగా నమ్మకపోవడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమాన్ని ఎత్తుకుంది వైసిపి.

అందులో భాగంగానే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. టీటీడీలో నందిని డెయిరీ టెండర్ ను రద్దు చేశారని.. ఇందాపూర్ డెయిరీకి ఎక్కువ ధరకు కాంట్రాక్టు అప్పచెప్పారంటూ ఆరోపించారు. పైగా సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన హెరిటేజ్ తో ఇందాపూర్ డెయిరీకి లింక్ ఉందని.. అందుకే ఆ సంస్థకు టెండర్ అప్పచెప్పారంటూ పసలేని ఆరోపణలు చేశారు. కానీ అవేవీ నిజం కాదు అంటూ సాక్షాలతో టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు గారు తేట తెల్లం చేశారు. దెబ్బకు వైసిపి నేతలు అంతా ఈ విషయం మీద ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు.

కానీ అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఏకంగా శాసనమండలి సాక్షిగా ఇలా అబద్ధాలు చెప్పడం ఏంటని కూటమినేతలు మండిపడుతున్నారు. ఎందుకంటే శాసనమండలిలో చెప్పే ప్రతి మాట రికార్డులో ఉంటుంది. చట్టసభల్లో నిజాలు మాత్రమే మాట్లాడాలి. కానీ వైసీపీ నేతలు ఇలా అడ్డగోలుగా అబద్ధాలు చెబుతూ.. సభా గౌరవాన్ని తగ్గిస్తున్నారు అంటున్నారు కూటమినేతలు.

Tags

Next Story