YSRCP : అధికారంలో ఉంటే మతంపై దాడి.. వైసిపి తీరు..

YSRCP : అధికారంలో ఉంటే మతంపై దాడి.. వైసిపి తీరు..
X

వైసిపి అధికారంలో ఉంటే అభివృద్ధి చేయాల్సింది పోయి.. ఏపీకి పెట్టుబడులు తీసుకురావాల్సింది పోయి.. హిందూమతంపై దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నంత సేపు హిందూ ఆలయాలపై ఎన్ని దాడులు జరిగాయో చూసాం. ఏకంగా శ్రీరాముడి విగ్రహం మీద దాడి చేసిన ఘోరం కూడా వైసిపి హయాంలోనే జరిగింది. ఇవేవీ సరిపోవు అన్నట్టు ఏకంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలోని అత్యంత దారుణాలకు పాల్పడ్డారు. ఏకంగా భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కెమికల్ తో తయారుచేసిన నెయ్యిని కలిపేసి కోట్లాదిమందితో తినిపించారు. ఇక్కడ హిందువుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా.. భక్తులు పెట్టుకున్న నమ్మకం మీద దాడి చేశారు.

వైసిపి నేతలకు, అప్పటి సీఎం జగన్ కు ఈ ఘోరాలు అన్నీ తెలిసినా సరే వ్యతిరేకించలేదు. కనీసం యాక్షన్ తీసుకోలేదు. హిందూ ఆలయాలపై దాడులు చేసిన వారి మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు అప్పటి సీఎం జగన్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగిన దారుణాలను ఒక్కొక్కటి బయటకు తీస్తుంటే.. హిందువుల మనోభావాలపై వైసీపీ చేసిన దాడిగా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే వందల ఏళ్ల చరిత్ర ఉన్న తిరుమల ఆలయంలోనే ఇంత ఘోరానికి పాల్పడారు అంటే.. ఇంతకన్నా మహాపాపం ఇంకొకటి ఉండదు. ఇంత చేసినా సరే వాళ్ళలో ఎలాంటి పశ్చాతాపం లేదు. జగన్ కూడా తమ పార్టీ నేతలపై ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా.. వాళ్లు చేసింది అసలు నేరమే కాదన్నట్టు మాట్లాడుతున్నారు.

పరకామణి చోరీ విషయంలో జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూశాం. పరకామణిలో చోరీకి గురి అయింది కేవలం 70 వేలే అని.. దానికి బదులుగా తాము కోట్లాది రూపాయల ఆస్తులు టీటీడీకి రాయించామంటూ గొప్పలు చెప్పుకున్నారు జగన్. కాబట్టి పరకామణి చోరీ అనేది తప్పు కాదు అన్నట్టు జగన్ మాట్లాడుతున్నారు. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదేమో. ఎందుకంటే ఇక్కడ జగన్ హిందువుల భావాలు, వాళ్ల నమ్మకాలను చాలా చిన్నచూపు చూస్తున్నారు. పైగా లడ్డు కల్తీలో జంతువుల కొవ్వు కలవలేదని.. కల్తీ జరిగితే తప్పేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి వైసిపి హిందూ మతం మీద ఎలాంటి దాడులు చేస్తుందో అందరూ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags

Next Story