YS Jagan : వైసిపి అధికారంలో అలా.. ఇప్పుడు ఇలా..!

వైసిపి ఏపీ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించే వారిని వేధించారు. అక్రమ కేసులు పెట్టారు. డాక్టర్ సుధాకర్ లాంటి వారిని కొట్టి చంపేశారు. వైసీపీ ప్రతినిధులు తమ డ్రైవర్లను నరికేసి ఇంటికి పార్సల్ చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాల లీడర్ల ఇంట్లో మహిళలను బూతులు తిడుతూ అవమానించారు. రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాకుండా చేశారు. అమర్ రాజా లాంటి కంపెనీలను తామే తరిమేసామని గొప్పగా చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన కంపెనీలను భయపెట్టి పారిపోయారు చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలు తమ స్థాయిని మర్చిపోయి బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. వాళ్ల అరాచకాలు భరించలేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. పేదల భూములు లాక్కున్నారు. రౌడీలు, లేడీ డాన్లను పెంచి పోషించారు వైసిపి నేతలు. ఏపీలో శాంతి భద్రతలు అనేవి లేకుండా మరో బీహార్ రాష్ట్రంలా తయారు చేశారు.
ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళ తీరు అస్సలు మారట్లేదు. ఏకంగా రప్పా రప్పా నరికేస్తామంటున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరే అని ఒక్కొక్కరినీ నరికేస్తామంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా సరే ఇవే పోస్టర్లు కనిపిస్తున్నాయి. పైగా అలా చేస్తే తప్పేంటి అని జగన్ మీడియా ముందు చెప్పడం ఆయన తీరుకు నిదర్శనం. జగన్ మాటలతో వైసిపి బ్యాచ్ మరింత రెచ్చిపోతూనే ఉంది. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో నల్లజర్ల మండలంలో మేకపోతును నిజంగానే నరికేసి జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారు. వాళ్ల తీరు రాను రాను భయంకరంగా మారుతుంది.
నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగానే వాళ్ళు కత్తులతో చేస్తున్న విన్యాసాలు మామూలుగా లేవు. ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రవర్తనతో ఏపీని భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఏకంగా జంతువులను నరికేస్తూ తమ క్రూరత్వాన్ని బయటపెడుతున్నారు. 2029లో తామే గెలుస్తామని ఆ తర్వాత ఒక్కొక్కరినీ జైల్లో వేస్తామంటూ పెట్టుబడిదారులను రానివ్వకుండా కుట్రలు చేస్తున్నారు. పిపిపి విధానంలో టెండర్లకు పిలిస్తే వైసిపి బెదిరింపులకు భయపడి ఒక్కరు కూడా రావట్లేదు. అంటే వాళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన వైసీపీ ఉన్నంతకాలం ఏపీ అభివృద్ధికి నోచుకోదు అని ప్రజలకు కూడా అర్థమవుతుంది. వాళ్లు ఇలాగే ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో వైసిపి మనుగడే కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Tags
- YSRCP
- YS Jagan Mohan Reddy
- Andhra Pradesh Development
- Political Violence
- Rappa Rappa Threats
- Blood Abhishekam
- Animal Sacrifice Controversy
- Law and Order Failure
- Investor Fear
- Amar Raja Exit
- Industrial Decline
- Opposition Harassment
- Abuse of Power
- Public Safety Concerns
- Political Intimidation
- Coalition Government Criticism
- Crime Politics Nexus
- Anarchy Allegations
- AP Governance Issues
- Future of YSRCP
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

