YSRCP : బోరుగడ్డ అనిల్ విషయంలో ఇరుక్కున్న వైసీపీ

YSRCP : బోరుగడ్డ అనిల్ విషయంలో ఇరుక్కున్న వైసీపీ
X

వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్ని అరాచకాలు జరిగాయో.. ఎంతమంది రౌడీషీటర్లు రెచ్చిపోయారో మనం చూసాం. అందులో బోరుగడ్డ అనిల్ ఒకడు. వైసిపి పార్టీకి చెందిన ఇతను జగన్ ఆదేశిస్తే.. వాళ్లను చంపేస్తా.. వీళ్లను లేపేస్తా అంటూ ఎంతలా రెచ్చిపోయాడో చూసాం. ప్రతిపక్ష టిడిపి పార్టీని, జనసేన పార్టీని, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను ఎంత దారుణంగా తిట్టాడో ఏపీ ప్రజలకు తెలుసు. అప్పట్లో గుంటూరులో ఆయన ఆఫీసు మీద దాడులు జరిగితే.. జగన్ మీడియా మొత్తం వైసిపి నేత బోరుగడ్డ అనిల్ మీద దాడులు అంటూ నానా రచ్చ చేశాయి. అయితే అప్పట్లో వైసీపీ నేత అంటూ జగన్ మీడియాతో పాటు వాళ్ళ సోషల్ మీడియా మొత్తం బోరుగడ్డ అనిల్ గురించి చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం మా పార్టీ కాదంటుంది. ఐదేళ్లలో వైసీపీ ఎప్పుడైనా ఈ మాట చెప్పిందా. అనిల్ ఎంతలా రెచ్చిపోతున్నా అతని మీద ఒక్క కేసైనా పెట్టిందా అంటే లేదు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనిల్ అక్రమాలను బయటకు తీసి పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ మీద విడుదల అయిన తర్వాత కూడా అతనిలో పశ్చాత్తాపం లేదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రెచ్చిపోయి మాట్లాడుతుంటే డ్యామేజ్ జరుగుతుందని భావించిన వైసీపీ ఇప్పుడు బోరుగడ్డ అనిల్ మా పార్టీ కాదు అని ప్రకటించింది. వైసీపీ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి కూడా బోరుగడ్డ అనిల్ తో మాకు సంబంధం లేదంటున్నాడు. మరి మొన్న జగన్ నాంపల్లి కోర్టుకు వెళ్లినప్పుడు.. ఆయన కాన్వాయ్ లో అనిల్ కారు కూడా ఉంది కదా. మరి మీకు సంబంధం లేదు అన్నప్పుడు అతన్ని ఎందుకు రానిచ్చారు.

జగన్ కాన్వాయ్ లోనే అనిల్ కూడా లోటస్ పాండ్ కు వెళ్ళాడు. అక్కడ కొన్ని మీడియా ఛానల్లు అనిల్ ను ఇంటర్వ్యూ కూడా చేశారు. అందులో తాను జగన్ కు అండగా ఇక్కడకు వచ్చానని.. జగన్ తోనే తన ప్రయాణం అంటూ డైలాగులు కొట్టాడు. మరి అప్పుడు వైసిపి ఎందుకు ఈ ప్రకటన చేయలేదు. అనిల్ మాటలను ఎందుకు ఖండించలేదు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ మా పార్టీ వాడే అని చెప్పుకున్నారు కదా. మరి ఇప్పుడు పరువు పోతుందని దూరం పెట్టడం ఏంటి. ఈ పరువు అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు. మొత్తానికి బోరుగడ్డ అనిల్ విషయంలో ప్రజలు ఛీ కొడుతారనే ఉద్దేశంతోటే వైసిపి ఇలా మాట మార్చిందని తెలుస్తోంది.

Tags

Next Story