Pawan Kalyan : మళ్లీ రెచ్చిపోతున్న వైసీపీ బ్యాచ్.. పవన్ ఫైర్.

Pawan Kalyan : మళ్లీ రెచ్చిపోతున్న వైసీపీ బ్యాచ్.. పవన్ ఫైర్.
X

ఏపీలో వైసీపీ బ్యాచ్ మళ్లీ రెచ్చిపోతోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, రోజా, విడుదల రజినీ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డితో పాటు ఇంకొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ రేంజ్ లో రెచ్చిపోయారో చూశాం. వారంతా జగన్ కండ్లలో ఆనందం చూడటం కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, లోకేష్‌ లను ఇష్టం వచ్చినట్టు తిట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఫ్యామిలీని కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ అవమానించారు వీరంతా. వీళ్ల అరాచకాలు భరించలేక ప్రజలు అందరూ కూటమికే బంపర్ మెజార్టీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో వాళ్లంతా సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు, పవన్ తమ ప్రభుత్వం ఎవరి వెంట పడదని.. కక్షపూరిత రాజకీయాలు చేయబోమని చెప్పారు.

పేర్నినాని భార్యను అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి ఆడవారితో రాజకీయాలు వద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇలా ప్రభుత్వం కొంత తగ్గి అభివృద్ధిపై దృష్టిపెట్టడంతో వైసీపీ బ్యాచ్ మళ్లీ రెచ్చిపోతంది. రప్పా.. రప్పా అంటున్నారు. అధికారంలోకి వచ్చాక జైళ్లలో పెడుతామని వార్నింగులు ఇస్తున్నారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నిన్న సీరియస్ అయ్యారు. వీళ్లకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్ మెంటే కరెక్ట్ అని చెప్పారు. నిజమే కాబోలు. ఎందుకంటే వైసీపీ బ్యాచ్ కు మంచిగా చెబితే అర్థం కావట్లేదు. వాళ్లకు యోగి లాంటి పాలన అయితేనే వింటారు మరి.

ఏపీలో వైసీపీ రౌడీలు, రప్పా రప్పా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మరీ ఎక్కువ అవుతున్నారు. వీరంతా వైసీపీ అండ చూసుకునే రెచ్చిపోతున్నారు. వీరి కారణంగా ఏపీలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా ఉండాలంటే ఇలాంటి బ్యాచ్ కు గట్టి యాక్షన్ కావాల్సిందే. లేదంటే వాళ్ల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చంద్రబాబు మంచితనాన్ని వాళ్లు ఆసరాగా తీసుకుని రెచ్చిపోవాలని చూస్తున్నారు కాబట్టి.. ఇక వాళ్లకు మరో అవకాశం ఇవ్వకుండా కఠినమైన చర్యలు తీసుకుంటేనే బెటర్ అంటున్నారు కూటమి నేతలు.

Tags

Next Story