YSRCP : కల్తీ నెయ్యిపై వైసీపీ కవరింగులు.. ఇదేం తీరు..

YSRCP : కల్తీ నెయ్యిపై వైసీపీ కవరింగులు.. ఇదేం తీరు..
X

వైసిపి ప్రభుత్వంలో చేయని అరాచకాలు అంటూ లేవు. లిక్కర్ కేసు దగ్గర నుంచి మొదలుపెడితే.. కల్తీ లిక్కర్, భూకబ్జాలు, ప్రతిపక్షాలను వేధించడాలు.. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూలు కల్తీ చేసిన పాపం వైసిపిదే. సుప్రీంకోర్టు వేసిన సిబిఐ విచారణ జరిపి లడ్డూలు కల్తీ నెయ్యి వాడారని.. బోలెబాబా డెయిరీ ఒక్క చుక్క పాలు సేకరించకుండా పామాయిల్ తో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేసి టీటీడీకి సరఫరా చేసిందని తేల్చింది. అయితే ఇది తప్పు కాదంటూ వైసీపీ నేతలు కవరింగులు ఇవ్వడం మరీ దారుణంగా ఉంది. గతంలో కూటమి ప్రభుత్వం నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారు అంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి కూటమి చెప్పినట్టు నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు కదా.. ఇప్పుడు దానికి కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేయడం మరీ విడ్డూరంగా ఉంది. అంటే జంతువుల కొవ్వు ఉంటే తప్పు గానీ.. పామాయిల్ తో కల్తీ నెయ్యి తయారు చేస్తే తప్పేంటి అన్నట్టు వైసిపి నేతల తీరు ఉంది. అంటే పామాయిల్ తో కల్తీ నెయ్యి తయారు చేస్తే తప్పులేదా.. కోట్లాదిమంది హిందువుల నమ్మకాన్ని దెబ్బతీయడం తప్పు కాదా.. కల్తి నెయ్యి తినిపించి భక్తుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే పాపం కాదా. ఇవేవీ వైసీపీ నేతలకు తప్పుగా కనిపించట్లేదు.

కానీ కూటమి ప్రభుత్వం చెప్పినట్టు జంతువుల కొవ్వు లేదు కదా అని వాళ్ళు వాదించడం అంటే వాళ్ల మూర్ఖత్వానికి నిదర్శనం అంటున్నారు కూటమినేతలు. ఆ మధ్య మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ పరకామణిలో 70000 చోరీ జరిగింది అదేమైనా పెద్ద నేరమా అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు కల్తీ నెయ్యిలో ఇలాంటి వాదనలు వినిపిస్తున్నారు. అంటే వాళ్ల దృష్టిలో అంతకుమించినవి చేస్తేనే నేరాలు కావచ్చు. ఇలాంటివి వాళ్ల దృష్టిలో అసలు నేరాలు కావు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమీ లేకపోయినా సరే ఏదో ఉంది అన్నట్టు కూటమి ప్రభుత్వం మీద నిందలు వేసే వైసిపి నేతలు.. వాళ్ల నేరాలు సాక్షాలతో సహా బయటపడిన సరే ఇలాంటి కవరింగులు ఇవ్వడం ఏంటో మరి.

అంటే వైసీపీ నేతలు ఎంత పెద్ద తప్పులు చేసినా సరే వాళ్ళ దృష్టిలో అవి చిన్నగానే కనిపిస్తున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసినా సరే దానిమీద మసిబూసి మారేడు కాయను చేసినట్టు తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఇప్పటికే జనాల్లో వారికి ఆదరణ రాకపోయినా ఇలాంటి పిచ్చి వాదనలతో పబ్బం గడుపుతున్నారు. కానీ జనాలు వాళ్లను నమ్మట్లేదు అనే విషయాలను గ్రహించట్లేదు. అతి త్వరలోనే కోర్టులో కల్తీ నెయ్యి మీద కీలక తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కోర్టు తీర్పులను కూడా వైసిపి నేతలు వ్యతిరేకించిన ఆశ్చర్యపోనవసరం లేదు. రాబోయే కాలంలో వైసీపీ నేతలు ఇంకా ఎలాంటి అబద్ధాలు చెబుతారో వేచి చూడాలి.

Tags

Next Story