YSRCP : స్థానిక ఎన్నికల వేళ వైసిపి అరాచకాలు..

YSRCP : స్థానిక ఎన్నికల వేళ వైసిపి అరాచకాలు..
X

ఏపీలో వైసిపి నేతల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎలాగూ పట్టించుకోవట్లేదు అనే కోపంతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. మొన్న జగన్ పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరిలో ఎంతటి అరాచకానికి తెగించారో చూసాం. ఏకంగా పొట్టేలును నరికేసి జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారు. జగన్ బర్త్ డే సందర్భంగా తీసిన ర్యాలీలో అడ్డువచ్చిన గర్భిణీని తన్నారు. వాళ్ల అరాచకాలు చూసి జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. నడిరోడ్డు మీదనే జంతువులను బలిస్తూ తమ క్రూరత్వాన్ని బయటపెడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. అనంతపూర్ అర్బన్ ఏరియాలో టిడిపి దిమ్మెను వైసిపి నేతలు ధ్వంసం చేశారు. ఆ నిందితులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలిస్తే దాదాపు 200 మంది వైసీపీ నేతలు వచ్చి నానా రచ్చ చేశారు. ఏకంగా పోలీసుల మీదకే దాడులు చేసేందుకు ప్రయత్నించారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని తాము వచ్చాక ఏంటో చూపిస్తాం అంటూ పోలీసులకే వార్నింగ్ లు ఇస్తున్నారు.

అంటే వాళ్ల అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. పోలీసులనే అలా బెదిరిస్తున్నారు అంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి. ఒకవేళ వీళ్ళు అధికారంలోకి వస్తే మనుషులను కూడా ఇలాగే నరికేస్తారేమో అని భయపడిపోతున్నారు. ఏపీలో మరికొన్ని రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎలాగూ వైసీపీ నేతలను ప్రజలు ఓడగోడతారు అని వాళ్లకు అర్థమైపోయింది. అందుకే ఇలా బరితెగిస్తున్నారు. ప్రజలను ఇప్పటినుంచే భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో బలవంతంగా ఓట్లు వేయించుకోవాలి అనేది వైసిపి కుట్రగా అర్ధమైపోతుంది. గ్రామాల్లో తమ ఉనికి చాటుకునేందుకు వైసిపి ఇలాంటి అరాచకాలకు తరితిస్తోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

రక్తాభిషేకాలు, భయపెట్టేలా ర్యాలీలు, వేట కొడవళ్లతో హల్చల్ చేయడం వైసిపి కార్యకర్తలకు నేతలకు అలవాటు అయిపోయింది. ఇలాంటి అరాచకాలతో అధికారంలోకి రావాలి అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తుంటారు కదా. అహంకారం, అరాచకం ఎక్కువ అయిపోతే నెలకేసి కొడతారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు అంటే వైసిపి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇలాగే చేస్తే రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లు కూడా రావడం కష్టమే అవుతుంది అని వార్నింగులు ఇస్తున్నారు సామాన్య ప్రజలు.

Tags

Next Story