YCP MLC Arrest : వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్
టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఇదే కేసులో వైసీపీ నేతలు జోగి రమేశ్, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ కోసం అధికారులు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు గురువారం సాయంత్రం మంగళగిరి కోర్టులో హాజరు పర్చారు. దీంతో సురేశ్‌కు రెండు వారాల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. కాగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 19 అక్టోబర్ 2021న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పార్టీ ఆఫీసులోకి దూసుకొచ్చి.. కార్యాలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు. ఆఫీసులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలపైనా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆఫీసులోని ఫర్నీచర్ మొత్తం ధ్వంసమైంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com