YSRCP : వైసీపీ అధికార ప్రతినిధి అరెస్ట్

YSRCP : వైసీపీ అధికార ప్రతినిధి అరెస్ట్
X

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి ఏపీకి వస్తుండగా కుప్పం సమీపంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా తన వ్యాఖ్యలతో నాగార్జున వివాదాల్లో ఉన్నారు. చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై టీడీపీ ఫిర్యాదు చేసింది.

మరోవైపు నాగార్జున యాదవ్‌పై కేసుకు సంబంధించి గతవారం హైకోర్టులో కూడా విచారణ జరిగింది. నాగార్జునపై నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని కుప్పం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఓ టీవీ డిబేట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కె వరుణ్‌కుమార్‌ నాగార్జున యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నాగార్జునయాదవ్‌పై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.. వెంటనే నాగార్జున యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు.

Tags

Next Story