Badvel By Election: సగం రౌండ్లకే వైసీపీ గెలుపు స్పష్టం..

Badvel By Election (tv5news.in)
Badvel By Election: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా ఘన విజయం సాధించింది. సగం రౌండ్లు పూర్తయ్యే సరికి వైసీపీ గెలుపు స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి రౌండ్ నుండి వేరే అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వకుండా దాసరి సుధ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడవ రౌండ్ వచ్చేసరికి నియోజకవర్గంలోని సగానికి పైగా ఓట్లు వైసీపీకే దక్కాయి. దీంతో గెలుపు ఖరారయ్యింది.
తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన వైకాపా అభ్యర్థి దాసరి సుధ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి ఆమె 68,492 ఆధిక్యంలో ఉన్నారు. 8వ రౌండ్‌లో వైకాపాకు 9,691, భాజపాకు 1,964, కాంగ్రెస్‌కు 774, నోటాకు 364 ఓట్లు వచ్చాయి. అన్ని రౌండ్లలో కలిపి వైకాపాకు 84,682, భాజపాకు 16,190, కాంగ్రెస్‌కు 5,026, నోటాకు 2,830 ఓట్లు పోలయ్యాయి. వైకాపా ఆధిక్యం ముందు ఇతర పార్టీలేవి నిలబడలేకపోయాయి. పోలైన ఓట్లలో దాదాపు సగం కంటే ఎక్కువగా ఇప్పటికే వైకాపాకు రావడంతో ఉప పోరులో వైకాపా గెలిచినట్లైంది. కాగా, అధికారికంగా వైకాపా విజయాన్ని ప్రకటించాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com