YSRCP : కులాల మధ్య చిచ్చుకు వైసిపి మరో కుట్ర..

YSRCP : కులాల మధ్య చిచ్చుకు వైసిపి మరో కుట్ర..
X

వైసిపి పార్టీ ఏ చిన్న అవకాశం దొరికినా సరే కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం.. లేదంటే జనసేన, టిడిపి పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంది. అధికారం పోయినప్పటి నుంచి కూటమి కలిసి ఉండటాన్ని వైసిపి జీర్ణించుకోలేకపోతోంది. అందుకే రకరకాల విష ప్రచారాలు చేస్తూనే ఉంది. మొన్నటికి మొన్న కందుకూరు ఘటనలో ఎంతటి రాద్ధాంతం చేసిందో చూశాం. కమ్మ, కాపు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి.. అంతిమంగా జనసేన, టిడిపి పార్టీల మధ్య చిచ్చురాజేయడానికి చేయాల్సిన కుట్రలన్నీ చేసింది. చివరకు బాధిత కుటుంబమే ఇందులో కులాల ప్రస్తావన లేదని.. చనిపోయిన లక్ష్మీ నాయుడు, హరిశ్చంద్రప్రసాద్ చిన్నప్పటి నుంచి స్నేహితులే అని.. ఆర్థికపరమైన గొడవలే హత్యకు దారితీసాయని స్వయంగా చెప్పినా సరే.. వైసిపి తప్పుడు ప్రచారాలు ఆపలేదు. ఇప్పుడు గుంటూరు మహిళ ఆత్మహత్యపై ఇలాంటి దిక్కుమాలిన రాజకీయానికి తెరలేపింది.

గుంటూరులో శేషమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దీన్ని వైసిపి మీడియా రకరకాల తప్పుడు ప్రచారాలు చేసింది. టిడిపి పార్టీకి చెందిన.. కమ్మ కులస్తుడు అయిన కల్లూరి శ్రీనివాస్ వేధింపుల వల్లే శేషమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది అంటూ తప్పుడు ప్రచారానికి తెరతీసింది. కానీ చివరకు బాధిత కుటుంబమే ఇందులో రాజకీయ ప్రమేయం లేదని చాలా క్లియర్ గా వివరించింది. బాధిత కుటుంబం చెప్పిన దాని ప్రకారం.. శేషమ్మ అనే మహిళ కరోనా సమయంలో తన బంధువుల నుంచి 500000 అప్పుగా తీసుకుంది. పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ అప్పు కట్టలేదు. దీంతో అసలు వడ్డీతో కలిపి అప్పులు మొత్తం పది లక్షలు అయ్యాయి. బంధువులు తమకు అప్పు తిరిగి కట్టాల్సిందే అంటూ తీవ్ర ఒత్తిడి చేశారు. ఇప్పుడు తన పరిస్థితి బాగాలేదని శేషమ్మ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇంటి మీదికి వచ్చి గొడవలు చేయడంతో మనస్థాపానికి గురైన శేషమ్మ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకుంది.

ఆ సెల్ఫీ వీడియోలో ఆమె చాలా క్లియర్ గా తన చావుకు తన బంధువుల పేర్లు చెప్పింది. అందులో పొరపాటున కర్లపూడి శ్రీనివాస్ పేరుకు బదులు కల్లూరి శ్రీనివాస్ పేరు చెప్పి.. అదే వీడియోలో ఆమె సరి చేసుకుంది. కర్లపూడి శ్రీనివాస్ అంటూ ఆమెనే క్లియర్ గా చెప్పింది. కానీ వైసీపీ నాయకులు ఆ వీడియో మొత్తం పక్కన పెట్టేసి.. కల్లూరి శ్రీనివాస్ వేధింపుల వల్లే.. టిడిపి నేతల వేధింపుల వల్లే కాపు మహిళ ఆత్మహత్య చేసుకుందని.. రెండు కులాల మధ్య చిచ్చు రాజేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ చివరకు శేషమ్మ కుటుంబం స్వయంగా మీడియా ముందు అసలు నిజాలు చెప్పింది. కల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తమ ఊరిలో పెద్దమనుషి లాంటివాడని.. ఏదైనా సమస్య వస్తే ఆయన వద్దకే వెళ్తాం కాబట్టి పొరపాటున కర్లపూడి శ్రీనివాస్ పేరుకు బదులు కల్లూరి శ్రీనివాస్ పేరు శేషమ్మ చెప్పిందని ఆమె భర్త తెలిపాడు. ఇందులో ఎక్కడ రాజకీయం లేదన్నాడు. దీంతో వైసిపి నేతల నోర్లు మూసుకున్నాయి. అప్పటిదాకా చేసిన తప్పుడు ప్రచారం మొత్తం ఉత్తది అని తెలియడంతో స్థానిక ప్రజలు ఛీ అంటున్నారు వైసీపీ నేతల మీద.


Tags

Next Story