YSRCP : వైసిపికి కూటమినేతల ఛాలెంజ్.. కల్తీ నెయ్యిపై ప్రమాణం చేస్తారా..?

తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వైసిపి నేతలు ఎంతకైనా తెగిస్తారు అనేది ప్రతిసారి నిరూపితం అవుతూనే ఉంది. ఇప్పుడు తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడారు అనేది సిట్ అధికారులు తేల్చడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసిపి అత్యంత దారుణమైన ఘటనలకు తెరతీస్తోంది. లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు కాబట్టి క్షమాపణ చెప్పాలంటూ వింత డిమాండ్ చేసింది వైసిపి. దాన్ని ప్రజలు ఎవరు పట్టించుకోకపోవడంతో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు అంబటి రాంబాబుతో సీఎం చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టించారు మాజీ సీఎం జగన్. కుట్రలో భాగంగానే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయించి దాన్ని కూటమి ప్రభుత్వం మీదకు నెట్టేసేందుకు ప్లాన్ చేశారు. పైగా అంబటి రాంబాబు మీద దాడి చేయించింది టిడిపి కార్యకర్తలు కాదని ప్రమాణం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇక్కడ కూటమినేతలు కూడా వైసీపీకి ఒక ఛాలెంజ్ విసురుతున్నారు. లడ్డూలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి కలవలేదు అని ప్రమాణం చేయాలంటున్నారు. ఇప్పుడు సిట్ అధికారులు చార్జి షీట్ లో కెమికల్ తో నెయ్యిని తయారు చేశారు అని ఇచ్చారు కదా.. ఆ చార్జి షీట్ అబద్ధం అంటూ వైసీపీ నేతలు ప్రమాణం చేస్తారా అంటూ కూటమి సవాల్ చేస్తోంది. కానీ దీనిపై మాత్రం వైసిపి నేతలు సైలెంట్ అవుతున్నారు. ఎందుకంటే సిద్ధాధికారులు తేల్చింది అక్షరాల నిజం కాబట్టి. దొంగ ప్రమాణాలు చేస్తే ప్రజలు ఛీ కొడుతున్నారు కాబట్టి ఇకపై అలాంటి ప్రమాణాలు చేయొద్దని వైసిపి అధిష్టానం ఆర్డర్ చేసిందంట.
అందుకే సాక్షాత్తు తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో ప్రమాణాలు చేస్తే శిక్ష తప్పదు అనే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు ముందుకు రావట్లేదని సమాచారం. కూటమినేతల ఛాలెంజ్ ను పక్కన పెట్టేసి ఇలా కులాల మధ్య చిచ్చులు పెట్టేసి ప్రజల దృష్టికి మాలిక మళ్లించడమే పనిగా పెట్టుకున్నారు వైసిపి నేతలు. ఏ రాష్ట్రంలో లేనంత విద్వాంసాన్ని ఏపీలో సృష్టిస్తున్నారు వైసిపి బ్యాచ్. ఇదంతా మాజీ సీఎం జగన్ ప్లాన్ ప్రకారమే జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. వాళ్లే గొడవలు సృష్టించి వాళ్లే సింపతిని కొట్టేయడానికి ఇలా ప్లాన్ చేస్తున్నారని ప్రజలకు అర్థమైపోతుంది.
Tags
- YSRCP
- Tirumala Laddu controversy
- adulterated ghee case
- SIT charge sheet
- Chandrababu Naidu
- YS Jagan Mohan Reddy
- Ambati Rambabu attack
- political conspiracy Andhra Pradesh
- TDP vs YSRCP
- Tirumala Laddu scandal
- chemical ghee allegations
- Andhra politics news
- YSRCP cover up
- coalition government challenge
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
