ఆ మాత్రం తేడా కూడా తెలియదా బొత్స..?

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ కొత్త ప్లాన్ రెడీ చేసుకున్న విషయం తెలిసిందే. ఇందాపూర్ డెయిరీకి ఇప్పుడు టీటీడీ టెండర్ కట్టబెట్టినప్పటి నుంచి.. ఇందాపూర్ కు హెరిటేజ్ కు సంబంధాలు ఉన్నాయంటూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిలో నానా రచ్చ చేస్తున్నారు. నిన్న ఆయన మీడియా ముందుకు ఓ చీజ్ ప్యాకెట్ పట్టుకుని వచ్చి.. ఇది నెయ్యి ప్యాకెట్ అని.. ఇందాపూర్ నుంచి హెరిటేజ్ దీన్ని కొంటోందంటూ తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఆయన పట్టుకొచ్చింది చీజ్ ప్యాకెట్. హెరిటేజ్ సంస్థ కేవలం చీజ్ ను మాత్రమే ఇందాపూర్ నుంచి కొంటోంది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు చాలా స్పష్టంగా ఆధారాలతో సహా వివరించారు.
దీనిపై ఇప్పటికే హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో కేసు వేయగా.. అందుకు అనుకూలంగా సాక్షి మీడియాకు చెంపపెట్టులాంటి ఆర్డర్ ఇచ్చింది ఢిల్లీ ధర్మాసనం. హెరిటేజ్ మీద పెట్టిన పోస్టులను వెంటనే డిలీట్ చేయాలంటూ సాక్షి మీడియాను ఆదేశించింది. మరి బొత్స స్యతనారాయణకు చీజ్ కు, నెయ్యికి కూడా తేడా తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు కూటమి నేతుల. అంటే తాను పట్టుకొచ్చింది ఎవరు చూస్తారులే.. ఎవరు చదువుతారులే అనుకున్నారేమో బొత్స.
పైగా బోలేబాబా డెయిరీ విషయంలో కూడా ఆయన ఇలాగే మాట్లాడారు. బోలేబాబా డెయిరీ కంపెనీలు రెండు ఉన్నాయి. బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ అనేది 2004లో స్థాపించారు. ఇది టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదు. ఇంకోటి బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అనేది నెయ్యి సరఫరా చేసి ఇప్పుడు స్కామ్ లో ఇరుక్కుంది. హెరిటేజ్ కు వ్యాపార సంబంధాలు ఉన్నది బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్. అది టీటీడీకి నెయ్యిని సరఫరా చేయలేదు. కానీ ఈ విషయం చెప్పకుండా.. రెండు బోలేబాబా డెయిరీలు ఒకటే అంటారు బొత్స. అది ఆయన విజ్ఞతకు మాత్రమే వదిలేయాలి అంటున్నారు కూటమి నేతలు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
