Jogi Ramesh : జోగి రమేష్ ఇంటి వద్ద వైసీపీ భారీ స్కెచ్.. ప్లాన్ ప్రకారమే..

వైసీపీ నేతలకు సింపతీ రాజకీయాలు చేయడం కొత్తేం కాదు. అవసరం అనుకుంటే వాళ్ల మీద వాళ్లే దాడులు చేయించుకుని దాన్ని కూటమి మీద నెట్టేయడం వాళ్లకు అలవాటే. ఇప్పుడు ఏపీలో ఇలాంటి ప్లాన్ వేస్తోంది వైసిపి. మొన్న అమ్మటి రాంబాబు అత్యంత దారుణమైన మాటలతో సీఎం చంద్రబాబు నాయుడును తిట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు మీద అభిమానం ఉన్న వారెవరూ ఆ వ్యాఖ్యలను తట్టుకోలేరు కదా. అంబటి రాంబాబు ఇంటిముందు టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జోగి రమేష్ ఇంటి ముందు కూడా టిడిపి నేతలు శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశాలు ఉన్నాయని వైసీపీకి ముందే తెలిసింది.
దీన్ని జోగి రమేష్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పెద్ద స్కెచ్ వేశారు. టిడిపి కార్యకర్తలు తన ఇంటికి రాకముందే ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకున్నారు. టిడిపి నేతలు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో వందల మందిని జోగి రమేష్ అక్కడికి పంపించినట్లు స్థానిక కూటమి నేతలు చెబుతున్నారు. వైసిపి కార్యకర్తలు, జోగి రమేష్ వర్గంలో తిరిగే వారంతా కూడా కావాలనే గొడవలు పెద్దగా చేశారనీ.. ప్లాన్ ప్రకారం జోగి రమేష్ ఇంటిపై దాడులు చేశారని టిడిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే బాల్కనీలో చిన్నగా నిప్పు పెట్టి దాన్ని టిడిపి మీద నెట్టి వేసేందుకు వైసిపి ప్లాన్ చేసిందని అంటున్నారు స్థానిక ప్రజలు. తాము హింసను ప్రేరేపించే కార్యకర్తలు కాదని.. సీఎం చంద్రబాబు నాయుడు తమను ఎప్పుడు అలా ఉసిగోల్ప లేదని చెబుతున్నారు. మంత్రి నారా లోకేష్ మీద జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను తాను శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అక్కడికి వెళ్ళామని తేల్చి చెబుతున్నారు.
కానీ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్న వైసిపి ఇలాంటి స్కెచ్ వేసిందని అంటున్నారు. సింపతి కోసమే జోగి రమేష్ తన ఇంటికి తన వర్గంతోనే నిప్పు పెట్టించారని.. దాన్ని టిడిపి నేతల మీద నెట్టివేస్తున్నారంటూ మండిపడుతున్నారు టిడిపి కార్యకర్తలు. సింపతి రాజకీయాలు ఎన్ని చేసినా సరే ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. వైసీపీకి తగిన బుద్ధి చెబుతారు అంటూ మండిపడుతున్నారు కూటమినేతలు.
Tags
- YSRCP sympathy politics
- Jogi Ramesh controversy
- Ambati Rambabu remarks
- attack drama allegations
- TDP protest incident
- Chandrababu Naidu supporters
- Andhra Pradesh political clash
- YSRCP false narrative
- coalition leaders reaction
- political violence allegations AP
- YSRCP propaganda tactics
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
