మారని వైసిపి తీరు.. చివరి అస్త్రం తీస్తామంటున్న పవన్.

మారని వైసిపి తీరు.. చివరి అస్త్రం తీస్తామంటున్న పవన్.
X

వైసిపి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. ఇప్పుడు అధికారం పోయినా సరే వాళ్ళ తీరు అస్సలు మారట్లేదు. అధికారంలో లేకున్నా దారుణమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. జగన్ స్వయంగా మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులను జైల్లో వేస్తామంటూ బెదిరిస్తున్నారు. పోలీసులు ఇతర అధికారులను బట్టలూడదీసి కొడతామని చట్టాలను అతిక్రమించి మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ పార్టీ, ఒక మాజీ సీఎం ఇలా మాట్లాడుతాడని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి భాష అసలు వాడలేదు. కానీ ఇప్పుడు వైసీపీలో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్ వాళ్ళ అసలు రూపాన్ని బయటపెడుతోంది. అధికారులను, పెట్టుబడిదారులను, ప్రభుత్వాన్ని బెదిరిస్తూ వైసిపి రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు.

రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వస్తున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. వీటన్నింటిని చూసిన వైసిపి.. ఏపీ అభివృద్ధి చెందితే ఎప్పటికీ వైసీపీ అధికారంలోకి రాదని గ్రహించి.. ఏపీ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. వీళ్ళ ఆగడాలకు అధికారులు కూడా ఒకింత భయపడుతున్నారు. వీళ్ళ అరాచకాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోకపోతే తమ చిట్టచివరి అస్త్రం కూడా బయటకు తీస్తామంటూ హెచ్చరించారు. ఇదే క్రమంలో జనసేన నేతలకు కూడా ఒక పిలుపు ఇచ్చారు.

రాబోయే 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉంటుందని.. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానిచ్చే ప్రసక్తి లేదన్నారు. తాను ఉన్నంతకాలం వైసిపిని రానివ్వనని.. వైసిపి ఆగడాలు ఎక్కువైతే చిట్టచివరి అస్త్రం కూడా బయటకు తీస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రోడ్డు మీదకు వచ్చి ఏం చేశామో అందరికీ తెలుసు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి చట్టాలను గౌరవించి ఓపిక పడుతున్నామని.. కానీ వైసిపి ఇలాగే రెచ్చిపోతే తాము కూడా రోడ్డు ఎక్కాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో కొన్ని సర్దుబాట్లు అవుతాయని వాటికి పార్టీ నేతలు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. పార్టీ, రాజకీయం అంటే ఒక బాధ్యత అని.. ఏపీ అభివృద్ధి చెందడమే జనసేన అతిపెద్ద బాధ్యత అని గుర్తు చేశారు. దానికోసం వైసిపిని అధికారంలోనికి రానివ్వకపోవడమే తమ ప్రధాన లక్ష్యం అంటూ పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

Tags

Next Story