Yuva Galam Padayatra: యువగళం విజయోత్సవ సభకు సర్వం సిద్ధం

యువగళం నవశకం బహిరంగ సభకు వేలాదిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు బయలుదేరారు. యువగళం నవశకం బహిరంగ సభకు జిల్లా నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ధర్మవరంలో ప్రారంభమైన ఎన్టీఆర్ ఎక్స్‌ప్రెస్ రైలు అనంతపురం, గుత్తి రైల్వే స్టేషన్లలో టీడీపీ కార్యకర్తలను ఎక్కించుకుని బయలుదేరింది. ధర్మవరం, అనంతపురం గుత్తి రైల్వే స్టేషన్‌కు వేలాదిగా తెలుగదేశం శ్రేణులు చేరుకున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు విజయనగరానికి బయలుదేరారు. టీడీపీ శ్రేణుల రాకతో అనంతపురం రైల్వే స్టేషన్ పసుపుమయంగా మారిపోయింది.
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద రేపు జరగనున్న భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, లోకేశ్ పాల్గొంటారు. ఈ సభకు దాదాపు 6 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండడంతో సరిపడా గ్యాలరీలు సిద్ధం చేశారు. చుట్టుపక్కల నుంచి వాహనాల్లో తరలివచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు.
యువగళం ముగింపు సభకు హాజరయ్యేందుకు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి అభిమానులతో ప్రత్యేక రైలు బయలుదేరింది. ఇది అనంతపురం, గుత్తి మీదుగా విశాఖపట్టణం చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో కార్యకర్తలు, అభిమానులు పోలిపల్లి సభకు చేరుకుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com