Yuvagalam : కిలోమీటర్ల మేర పసుపు సైన్యం దండుకడుతుంది

డైమండ్ పాప చీరలు, గాజులు పంపితే తెలుగింటి ఆడపడుచులకు కానుకగా ఇస్తానన్నారు. ఇక నగరిలో రోజా అభివృద్ధి చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు

తిరుపతి జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. విత్తలతడుకు వద్ద లోకేష్‌తో యువత సెల్ఫీలు తీసుకున్నారు. మహిళలు, యువకులు లోకేష్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు బారులు తీరారు. ఇక అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ లోకేష్‌ పాదయాత్రలో ముందుకు వెళ్తున్నారు.

ఇక యువగళం పాదయాత్రలో తిరుపతి జిల్లా పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. పాదయాత్రలో ఉన్న లోకేష్‌ చుట్టూ పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది మఫ్తీలో తిరుగుతున్నారు. స్వయంగా పోలీసులే పాదయాత్రను కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లోకేష్‌ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. లోకేష్‌ ఎక్కడికి వెళ్లిన ఆయన చుట్టూనే తిరుగుతూ నిబంధనల పేరుతో హక్కులను కాలరాస్తున్నారు. లోకేష్ ను ఎక్కడా మాట్లాడనీయకుండా మైకులు లాక్కుంటున్నారు. ఇక పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఎన్ని అడ్డంకులు సృష్టించిన పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.

లోకేష్ ఎక్కడికి వెళ్లిన వేలాది మంది కార్యకర్తలకు ఆయన వెంటే కదులుతున్నారు. యువగళం పాదయాత్రతో రహదారులన్నీ పసుపుమయంగా మారుతున్నాయి. కిలోమీటర్ల మేర పసుపు సైన్యం దండుకడుతుంది. ఇక వైసీపీ పాలనలో తాము పడుతున్న కష్టాలను ప్రజలు లోకేష్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు. అన్ని వర్గాల సమస్యలు తెలుసుకుంటూ.. వినతులు స్వీకరిస్తూ అండగా ఉంటానని లోకేష్‌ భరోసా ఇస్తున్నారు. ఇక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై లోకేష్ విమర్శనాస్రాలు సంధిస్తున్నారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేస్తున్నారు.

అటు.. నగరి అడ్డాలో లోకేష్‌ గర్జించారు. మంత్రులు పెద్దిరెడ్డి, రోజా టార్గెట్‌గా ఉగ్రరూపం ప్రదర్శించారు. రోజాపై జబర్దస్త్ ఆంటీ అంటూ పంచ్‌ల వర్షం కురిపించిన లోకేష్.. చీరలు, గాజులు ఎందుకు పంపలేదో చెప్పాలన్నారు. డైమండ్ పాప చీరలు, గాజులు పంపితే తెలుగింటి ఆడపడుచులకు కానుకగా ఇస్తానన్నారు. ఇక నగరిలో రోజా అభివృద్ధి చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు.

ఇక యువగళం పాదయాత్ర నేటితో 19వ రోజుకు చేరింది. ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. ఉదయం మెత్తలతడుకు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. కాసేపట్లో నారాయణ వనం మండలం నుంచి నిండ్ర మండలానికి చేరుకోనున్నారు. ఇక మధ్యాహ్నం అయ్యారు కండ్రిగలో భోజన విరామం తీసుకోనున్నారు. నిండ్ర చెక్కర ఫ్యాక్టరీ మీదుగా సత్యవేడు నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ఎంట్రీ కానుంది.

Tags

Next Story