Yuvagalam : రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 25వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం జీ. పాళెం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అంతకుముందు మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడికి నివాళలర్పించారు లోకేష్. ఎర్రన్నాయుడు 66వ జయంతి సందర్భంగా....జీ పాలెం విడిది కేంద్రంలో ఆయన చిత్రపటానికి నివాళులల్పించారు.
లోకేష్‌కు అడుగడుగునా జన నీరాజనం పలుకుతున్నారు. స్థానికుల కష్టాలు తెలుసుకుంటూ వారిలో భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు . గాజుల మాండ్యంలో ఎస్టీ సామాజిక వర్గ నేతలతో సమావేశమవుతారు. తర్వాత రేణిగుంట వై కన్వెన్షన్ హాలులో ఆర్ఎంపీ వైద్యులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత యాదవ సామాజిక వర్గీయులతో భేటీ కానున్నారు లోకేష్. తర్వాత రేణిగుంట బస్టాండ్ సమీపంలో దుకాణదారులతో సమావేశం నిర్వహిస్తారు. ఇక ఇవాళ రాత్రి తిరుపతి అంకుర హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో లోకేష్ బస చేస్తారు.
యువగళం పాదయాత్రకు నీలిసానిపేట ఎస్టీ కాలనీ వాసులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. పాదయాత్రలో ప్రతి గ్రామం వద్ద భారీగా తరలివచ్చిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు లోకేశ్‌కు ఘనస్వాగతం పలుకుతున్నారు.ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, సెల్ఫీలు దిగేందుకు యువత ఆసక్తిని కనబరుస్తున్నారు. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన వాళ్లను ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ల సమస్యలు వినడమే కాకుండా అధికారంలోనికి రాగానే వాటిని పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com