Yuvagalam : నిరుద్యోగులకు వైసీపీ సర్కార్ తీవ్ర అన్యాయం : లోకేష్

Yuvagalam : నిరుద్యోగులకు వైసీపీ సర్కార్ తీవ్ర అన్యాయం : లోకేష్
జగన్‌ను ఇంటికి పంపితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.

నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. 27వ రోజు తిరుపతి జిల్లాలో యువగళం జోష్ నెలకొంది. లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో తిరుపతి నగరం జనసంద్రంగా మారింది. యువనేతకు స్వాగతం పలికేందుకు వేలాది మంది తరలివస్తున్నారు. పాదయాత్రలో టీడీపీ అగ్రనేత వెంట అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక అందరి సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసా కల్పిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు.

నిరుద్యోగులకు వైసీపీ సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తోందని లోకేష్ మండిపడ్డారు. పాదయాత్రలో చిరువ్యాపారుల దగ్గరు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏం సాయం ఆశిస్తున్నారని లోకేష్ అడగగా.. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. దీంతో బతుకు భారంగా మారిందని వారు లోకేష్‌కు చెప్పారు. ఇక అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని లోకేష్ వారికి భరోసా కల్పించారు.

అంతకు ముందు భవన నిర్మాణ కార్మికులతో లోకేష్‌ సమావేశం అయ్యారు. తమ సమస్యలను యువనేతకు కార్మికులు చెప్పుకున్నారు. ఇక అందిరికి అండగా ఉంటామన్న లోకేష్.. వైసీపీ అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా మారిందన్నారు. జగన్‌ను ఇంటికి పంపితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.

Tags

Next Story