Yuvagalam: పీలేరులో యువగళం జోష్

Yuvagalam: పీలేరులో యువగళం జోష్
వైసీపీ పాలనలో తాము పడుతున్న కష్టాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి చెప్పుకుంటున్న ప్రజలు

పీలేరు నియోజవర్గంలో యువగళం జోష్ కొనసాగుతుంది. లోకేష్ వెంట వేలాది మంది యువత కదులుతున్నారు. ఇక యువ నేత ఎక్కడికి వెళ్లిన ఘన స్వాగతమే లభిస్తోంది. మంగళహారతులతో మహిళలు లోకేష్‌కు స్వాగతం పలుకున్నారు. ఇక వైసీపీ పాలనలో తాము పడుతున్న కష్టాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి చెప్పుకుంటున్నారు. అందరి సమస్యలను ఓపికగా వింటున్న యువ నేత.. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక నేటితో యువగళం యాత్ర 36వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 458.5 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. పాదయాత్రలో భాగంగా ఇవాళ ఉదయం 9గంటలకు పీలేరు శివారు వేపులబయలులో బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనతరం విడిది కేంద్రం నుంచి 10గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. 11గంటలకు అంకాళమ్మతల్లి దేవాలయం వద్ద ఉప్పర, సగర సామాజికవర్గీయులతో మాటామంతీలో పాల్గొంటారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు శివాపురం గ్రామంలో స్థానికులతో భేటీ అవుతారు. ఆ తర్వాత తిమ్మిరెడ్డిగారిపల్లిలో భోజన విరామం తీసుకుంటారు.

ఇక మధ్యాహ్నం మూడున్నర గంటలకు తిమ్మిరెడ్డిగారిపల్లి నుంచి తిరిగి పాదయాత్ర కొనసాగిస్తారు. ఆతర్వాత కొర్లకుంట పట్టికాడ గ్రామంలో స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. కలికిరి పంచాయితీ సత్యపురం వద్ద స్థానికులతో సమావేశం అవుతారు. ఇక 5గంటలకు కలికిరిలో రైతులతో భేటీ అయి వారి సమస్యలు తెలుసుకుంటారు. ఆ తర్వాత నగిరిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ నిర్వహిస్తారు. ఆరున్నర గంటలకు కలికిరి ఇందిరమ్మ కాలనీ వద్ద పార్టీలో చేరికలు ఉండనున్నాయి. అక్కడే 36వ రోజు పాదయాత్ర ముగించనున్నారు. రాత్రికి లోకేష్‌ అక్కడే బస చేస్తారు.

Tags

Next Story