Yuvagalam: కోడుమూరులో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర

లోకేష్ యువగళం పాదయాత్ర ఇవాల్టితో 88వ రోజుకు చేరింది. ప్రస్తుతం ఆయన.. కోడుమూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. లోకేష్ను కలుసుకుని.. తమ సమస్యల్ని విన్నవించుకుంటున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా కోడుమూరు మండల రైతులు లోకేష్‌ను కలిశారు. తమ సమస్యలను వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమలో ప్రాజెక్టుల కోసం 11వేల కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ అధికారంలోకి వచ్చాక పది శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు. మరమ్మతులు చేయకపోవడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మరమ్మతు పనులు చేపట్టి.. కోడుమూరు మండల రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు.
జగన్ పాలనలో దళితులపై దమనకాండ జరుగుతోందని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను చంపి జగన్ డోర్ డెలవరీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. దళిత సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ ఫైర్ అయ్యారు.
ఇక.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక అక్రమ రవాణా ద్వారా 10వేల కోట్లు దోచుకున్నారని లోకేష్ ఆరోపించారు. ఇసుక అక్రమ తవ్వకాల కోసం అన్నమయ్య ప్రాజెక్టు వద్ద వరదల సమయంలో గేట్లు ఎత్తకపోవడంతో.. 61 మంది అమాయక ప్రజలు బలయ్యారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి.. అనుగొండ వాగు పూడికతీత చేపట్టి ముంపు బారిన పడకుండా రక్షణ కల్పిస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com