Yuvagalam : న్యాయవ్యవస్థపై వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది : లోకేష్

Yuvagalam : న్యాయవ్యవస్థపై వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది : లోకేష్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక న్యాయవ్యవస్థపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు నారా లోకేష్‌. పెనుకొండ నియోజకవర్గం పాలసముద్రం క్రాస్‌ వద్ద సత్యసాయి జిల్లా న్యాయవాదులు.. లోకేష్‌ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ ప్రభుత్వం రాగానే రాయలసీమ ప్రాంత కక్షిదారులకు సౌలభ్యంగా ఉండేలా ఈ ప్రాంతంలో హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి నెలా యువ న్యాయవాదులకు ఇస్తున్న 5వేల భృతితో పాటు.. రాయితీపై లా పుస్తకాలు ఇవ్వాలని విన్నవించారు. న్యాయవాదులకు 4 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి.. ప్రభుత్వ సంస్థల ద్వారా నిర్మానానికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. న్యాయవాదులు చట్ట సభలు, స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి లోకేష్‌ను కోరారు.

సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టులోనే కప్పు కాఫీ దొరికే పరిస్థితి లేదని ఓ న్యాయమూర్తి వ్యాఖ్యానించడం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు లోకేష్‌. టీడీపీ అధికారంలోకి వచ్చాక యువ న్యాయవాదుల నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. న్యాయవాదులకు రాయితీపై ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story