1500 కిమీ పూర్తి.. యువగళం పాదయాత్రకు విశేష స్పందన

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది. ఇప్పటి వరకు 15వందల 56 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. యువనేత ఎక్కడికి వెళ్లిన జననీరాజనం లభిస్తోంది. అడుగడుగునా ఘన స్వాగతాలు పలుకుతున్నారు. మహిళలు మంగళ హారతులతతో స్వాగతం పలుకుతూ.. వైసీపీ పాలనలో వారు పడుతున్న కష్టాలను చెప్పుకుంటున్నారు. అందరి సమస్యలను వింటున్న లోకేష్.. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
పాదయాత్రలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు నదియాబాద్ క్యాంప్ సైట్ లో రైతులతో ముఖాముఖిలో పాల్గొనున్నారు లోకేష్. ఇక సాయంత్రం నాలుగు గంటలకు నదియాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం సోమేశ్వరపురం చేరుకుని అక్కడ రైతులతో భేటీ అవుతారు. అక్కడి నుంచి ఎర్రబల్లెకు చేరుకుని విద్యార్థులతో సమావేశం కానున్నారు. ఇక అప్పరాజుపేటలో గ్రామస్తులతో భేటీ, రాజుపాలెం, వెంకటశెట్టిపల్లి, కొంగలవీడులో స్థానికులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
అనంతరం పాదయాత్రగా శివరాంనగర్ చేరుకుంటారు. అక్కడ రైతులతో భేటీ అవుతారు. ఇక శంకరాపురం క్రాస్, గొడుగునూరులో స్థానికులతో సమావేశం కానున్నారు. చింతలచెరువు క్రాస్ వద్ద గ్రామస్తులతో, బయ్యనపల్లిలో స్థానికులతో భేటీ అవుతారు. ఆ తరువాత అబ్బూసాహెబ్ క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. అనంతరం పాదయాత్రగా బద్వేలు శివారు విద్యానగర్ విడిది కేంద్రానికి చేరుకుంటారు. ఇక్కడితో 123వ రోజు పాదతయాత్ర ముగుస్తోంది. రాత్రికి లోకేష్ అక్కడే బస చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com