TDP Lokesh Yuvagalam : 2500 కిమీల మజిలీకి చేరుకున్న యువగళం!

ప్రకాశం బ్యారేజిపై పోటెత్తిన జనం...విజయవాడలో ప్రభంజనం
చారిత్రాత్మక యువగళం ( Yuvagalam )పాదయాత్ర 188వరోజు మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో ( undavalli )2500 కి.మీ.ల మైలురాయి చేరుకుంది.
ఈ సందర్భంగా నారా లోకేష్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఇళ్లులేని 20వేల మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు, దీంతోపాటు అసైన్డ్, కొండ, వాగు, అటవీ, రైల్వే, ఇతర భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్దీకరించి పట్టాలు అందజేస్తానని మాటఇచ్చారు.
ఉండవల్లిలోని చంద్రబాబుగారి నివాసం వద్దనుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్రకు కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభించింది కొండవీటి వాగు వద్ద లోకేష్ కు బోట్ అసోసియేషన్ ప్రతినిధులు యువగళం జెండాలతో కృష్ణానదిలో బోట్లపై స్వాగతం పలికారు వైసిపి ప్రభుత్వం లో తాము నష్టపోయిన తీరును వివరిస్తూ వినూత్న గజమాలను ఏర్పాటుచేశారు.తమకు పూర్వవైభవం తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా నదిలో పడవలను ప్రదర్శించారు.
యువగళం పాదయాత్ర గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం బ్యారేజి ( prakasam barrage )పై గుండా ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి ప్రవేశించే సమయంలో భారీగా ప్రజలు హాజరయ్యారు. విజయవాడ ప్రజలు యువనేతకు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు యువనేతకు వీడ్కోలు పలకగా, విజయవాడ నాయకులు ఘనస్వాగతం పలికారు. పసుపుజెండాలు, యువగళం బెలూన్లతో నారా లోకేష్ ను ( Nara Lokesh) స్వాగతించారు. భారీగా తరలివచ్చిన ప్రజలతో ప్రకాశం బ్యారేజి పరిసరాలు జనసంద్రంగా మారాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొడుతూ యువనేతను స్వాగతించారు. బాణాసంచా మోతలు, నినాదాలతో హోరెత్తుతున్న ప్రకాశం బ్యారేజి పరిసరాలు హోరెత్తాయి. అనంతరం పశ్చిమ నియోజకవర్గంలోని వన్ టౌన్ లోకి యువగళం పాదయాత్ర ప్రవేశించింది. పార్టీ నేతలు కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్దావెంకన్న, టిడిపి వాణిజ్యవిభాగం నేత డూండీ రాకేష్ నేతృత్వంలో యువనేతకు ఘనస్వాగతం లభించింది. భారీ గజమాలలు, పూలవర్షంతో యువనేతను ముంచెత్తారు. విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ, గద్దే రామ్మోహన్ రావు, గద్దే అనూరాధ తదితరులు యువనేతను స్వాగతించారు. 188వరోజు యువనేత లోకేష్ 13.3 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2509.8 కి.మీ.ల మేర పూర్తయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com