Yuvagalam: మంగళహారతులతో లోకేష్‌కు మహిళల స్వాగతం

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. యువనేతకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్ ఎక్కడికి వెళ్లినా.. ఘన స్వాగతమే లభిస్తోంది. మంగళహారతులతో లోకేష్‌కు మహిళలు స్వాగతం పలుకుతూ.. వైసీపీ పాలనలో వారు పడుతున్న కష్టాలను చెప్పుకుంటున్నారు. అందరి సమస్యలు ఓపికగా వింటున్న లోకేష్.. టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇప్పటి వరకు 14వందల 70 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. ఇవాళ మైదుకూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 4గంటలకు విశ్వనాథపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్రలో భాగంగా మొర్రపల్లి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం అవుతారు లోకేష్. అనంతరం మైదుకూరు మున్సిపల్ ఆఫీసు వద్ద స్థానికులతో భేటీ కానున్నారు. అక్కడి నుంచి పాదయాత్రగా రాయలకూడలిలో బహిరంగసభ వద్దకు చేరుకుని ప్రసంగించనున్నారు యువనేత.
ఇక మైదుకూరు ఆర్టీసి బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతీ పాల్గొంటారు. అనంతరం మైదుకూరు శ్రీనివాసనగర్‌కు చేరుకుని అక్కడ స్థానికులతో, బాబా గుడి వద్ద రైతులతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి పాదయాత్రగా భూమయ్యపల్లి గుంటూరు కొట్టాల వద్దకు చేరుకుని స్థానికులు, రైతులతో విడివిడిగా సమావేశం కానున్నారు. రాత్రికి భూమయ్యపల్లి విడిది కేంద్రంలో బస చేస్తారు లో కేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com