Yuvagalam Vijayotsava Sabha: యువగళం విజయోత్సవ సభ..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో బుధవారం మధ్యాహ్నం యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు రానున్నారు. 110 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు 5, 6 లక్షల మoది హాజరవుతారని అంచనా.. 50 వేల మంది కూర్చుని బహిరంగంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
విజయోత్సవ సభ నిర్వహణకు 16 కమిటీలు ఏర్పాటు చేశారు. స్టేజీ 180 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు.. స్టేజీపై 600 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. స్టేజీ వెనుక 50 అడుగుల డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం అభిమానులు ప్రత్యేక రైళ్లలో విజయనగరం చేరుకోనున్నారు. ఉత్తరాంధ్ర వైపు 2 పార్కింగ్ స్థలాలు, విశాఖ వైపు 2 పార్కింగ్ స్థలాలు, ఒక్కో పార్కింగ్ స్థలం 50 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. భోగాపురం వచ్చే అన్ని వైపులా భోజన ఏర్పాట్లు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు బహిరంగ సభ జరగనుంది. విజయోత్సవ సభకు పలు ప్రాంతాల నుండి హాజరయ్యే వారికి పది ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు.
కాగా పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో జనసేనాని విశాఖ వెళ్లనున్నారు. పోలేపల్లిలో జరిగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం విజయోత్సవ సభలో జనసేనాని పాల్గొననున్నారు. ఒకే వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ కనిపించనుండటంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు టీడీపీ, జనసేన శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com