AP TDP: జై లోకేష్‌, జై టీడీపీ నినాదాలతో మార్మోగిన నెల్లూరు

AP TDP:  జై లోకేష్‌, జై టీడీపీ నినాదాలతో మార్మోగిన నెల్లూరు
సింహాపురి సింహానాదం

సింహాపురి గడ్డ సింహానాదం చేసింది. నెల్లూరు యువనేత లోకేష్ రాకతో జన సంద్రం పోటెత్తింది.యాత్రకు అడుగడుగునా జనహారతి పట్టారు.లోకేష్ తో కరచాలనం చేసేందుకు..సెల్సీలు దిగేందుకు పోటీలు పడ్డారు. పాదయాత్ర మాత్రమే కాదిది... ప్రజల కష్టాలు తెలుసుకునే యాత్ర. ఇది లోకేష్ కోసమో, టీడీపీ కోసమో కాదు... ప్రజల కోసం. ప్రజా శ్రేయస్సు కోసం. జనం మేలెంచి లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టారనే విషయం ప్రజలు గుర్తించారు. అందుకే అడుగడుగునా హారతులు పడుతున్నారు. నీరాజనం పలుకుతున్నారు. పాదయాత్రను అడ్డుకోడానికి అధికార పార్టీ వేయని ఎత్తులు లేవు. ప్రయత్నించని ఫీట్లు లేవు. కానీ ప్రజా బలం...లోకేష్ సంకల్పబలం ముందు ఆ ఎత్తులు, జిత్తులు పారడం లేదు. అటు నెల్లూరు జిల్లా జై లోకేష్‌, జై టీడీపీ నినాదాలతో మార్మోగిపోయింది.

ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 31రోజులపాటు 459 కిలోమీటర్ల మేర సాగిన లోకేష్ పాదయాత్ర కాక పుట్టించింది. వైసీపీ కంచుకోటల్లో యువనేత యాత్రకు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా..జనగళమే..యువగళమై మహోజ్వలంగా సాగుతున్న యువనేత నారా లోకేష్ పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెలరోజులపాటు ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు కంచుకోటగా భావిస్తున్న నెల్లూరు జిల్లాలో యువనేత పాదయాత్ర జన సునామీని తలపించింది.

యువనేత పాదయాత్రకు సంఘీభావం తరలివచ్చిన జన ప్రభంజనాన్ని చూసి అధికారపార్టీ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు.పాత నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యువగళం పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగింది.ఉమ్మడి జిల్లాలో 30మండలాలు,292 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది.వివిధ వర్గాలతో 36 ముఖాముఖి సమావేశాలు, 5చోట్ల రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో మహాశక్తితో లోకేష్ పేరిట మహిళలతో నిర్వహించిన భారీ సభ యువగళానికే హైలైట్ గా నిలిచింది.

ఇక యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కు జిల్లా వాసుల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని వినతులు వెల్లువెత్తాయి.వివిధ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ సమస్య పరిష్కారంతో పాటు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు, టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందిస్తామన్నారు.పది నెలలు ఓపిక పట్టండి.. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని అంటూ భరోసా ఇచ్చారు లోకేష్. మరో వైపు నెల్లూరు జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న కొందరు ప్రజాప్రతినిధులపై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు లోకేష్.అభివృద్ధిపై సిల్లీ బచ్చా బహిరంగ చర్చకు సిద్దమా.. అని సవాల్ విసిరారు. అలాగే ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతల అవినీతిని ఎండగడుతూ ముందుకు సాగారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story