Adipurush: ఆదిపురుష్ రిలీజ్ డేట్ మరింత వెనక్కి.. డార్లింగ్ ఫ్యాన్స్ గగ్గోలు

Adipurush: ఆదిపురుష్ రిలీజ్ డేట్ మరింత వెనక్కి.. డార్లింగ్ ఫ్యాన్స్ గగ్గోలు
ఇప్పటికే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఆది పురుష్, ఇప్పుడు మరింత వెనక్కి వెళ్లిన రిలీజ్ డేట్, డోలాయమానంలో అభిమానులు

Adipurush: డార్లింగ్ ఫ్యాన్స్ కు మరి కొన్ని రోజులు ఎదురుచూపులు తప్పేట్లు లేవు. సంక్రాంతికి వస్తుందనుకున్న ప్రభాస్ ఆది పురుష్ అనుకోని విధంగా జూన్ 2023కు పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం జూన్ లో కూడా డార్లింగ్ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.


టీజర్ విడుదలైన దగ్గర నుంచి ఆదిపురుష్ పై ఫిల్మ్ క్రిటిక్స్ దగ్గర నుంచి ఫ్యాన్స్ వరకూ అందరూ దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. గ్రాఫిక్స్ మరీ అసహజంగా ఉన్నాయని, రామాయణం వంటి మహా కావ్యాన్ని ఇలా భ్రష్టుపట్టించేస్తారా అంటూ అన్ని వర్గాల వారూ విమర్శలతో దండయాత్ర చేస్తూనే ఉన్నారు. దీంతో వెనక్కి తగ్గిన చిత్ర బృందం వీఎఫ్ఎక్స్ పై రీ వర్క్ చేసేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు జూన్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ముందు ప్రకటించినప్పటికి, అది కూడా సాధ్యం కాకపోవచ్చునని అర్ధమవుతోంది.


వీఎఫ్ఎక్స్ వర్క్స్ తో పాటూ కొన్ని సీన్లను సైతం రీషూట్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. సినిమాపై వెల్లువెత్తుతున్న విమర్శలను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో రీ వర్క్ చేయాలని దర్శకుడు ఓం రౌత్ భావిస్తున్నారట.


మరోవైపు తెలుగులో ప్రభాస్, దర్శకుడు మారుతితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందేే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ తరువాత దక్షణాది పరిశ్రమ పై దృష్టి సారించిన సంజూ బాబా మారుతి స్టోరీ లైన్ నచ్చడంతో వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story