Adipurush: ప్రభాస్ 'ఆదిపురుష్'లో బాలీవుడ్ హీరో గెస్ట్ రోల్..

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్లో బాలీవుడ్ హీరో గెస్ట్ రోల్..
X
Adipurush: ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి.

Adipurush: 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు ప్రభాస్. ఇప్పుడు తన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ చిత్రాలను తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. కేవలం ఇండియన్ భాషల్లోనే కాకుండా ఇంగ్లీషుతో పాటు పలు ఇతర ఫారిన్ భాషల్లో కూడా ప్రభాస్ సినిమాల విడదుదలకు ప్రయత్నిస్తున్నారు. అందులో ఒకటి ఆదిపురుష్.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో అన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కతున్నవే. ఇక ఈ హీరో మొదటిసారి బాలీవుడ్ దర్శకుడు అయిన ఓం రౌత్‌తో చేయి కలిపాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే 'ఆదిపురుష్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించుకుంది. ఇంతలోనే ఈ మూవీలో ఓ బాలీవుడ్ హీరో కూడా భాగమవ్వనున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఓం రౌత్.. తాన్హాజీ అనే హిస్టారికల్ సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్‌ను అందుకున్నాడు. అందులో విలన్‌గా నటించిన సైఫ్‌నే ఆదిపురుష్‌లో కూడా విలన్‌గా సెలక్ట్ చేశాడు. ఇప్పుడు తాన్హాజీలో హీరోగా నటించిన అజయ్ దేవగన్.. ఆదిపురుష్‌లో ఓ గెస్ట్ రోల్ చేయనున్నాడట. అది కూడా శివుడి పాత్రలో ఆయన కనిపించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన అజయ్.. మరోసారి ఆదిపురుష్‌తో అందరినీ అలరించనున్నాడు.



Tags

Next Story