Amitabh Bachchan: మరోసారి కోవిడ్ బారిన పడిన బిగ్ బి..

Amitabh Bachchan: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు అమితాబ్ ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అమితాబ్‌కు కరోనా సోకిన విషయం తెలియగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పలువురు ట్విటర్ వేదికగా స్పందించారు.
త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాగా విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. అమితాబ్ కరోనా బారిన పడడం ఇది రెండో సారి. 2020లో కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. ఆసమయంలో బిగ్ బీ కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య బచ్చన్ సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు.
T 4388 - I have just tested CoViD + positive .. all those that have been in my vicinity and around me, please get yourself checked and tested also .. 🙏
— Amitabh Bachchan (@SrBachchan) August 23, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com